సినిమా

Prabhas: 19 ఏళ్ల సినీ కెరీర్‌లో ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన ఒకేఒక్క హిందీ చిత్రం ఇదే..

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ సినీ కెరీర్‌కు ఇటీవల 19 ఏళ్లు పూర్తయ్యాయి.

Prabhas (tv5news.in)
X

Prabhas (tv5news.in)

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ సినీ కెరీర్‌కు ఇటీవల 19 ఏళ్లు పూర్తయ్యాయి. 2002 అక్టోబర్ 10న 'ఈశ్వర్' సినిమా విడుదలయ్యింది. అదే తన మొదటి చిత్రం. కెరీర్ మొదట్లో హిట్ల కోసం ప్రభాస్ కాస్త కష్టపడ్డాడు. రెండేళ్ల తర్వాత 2004లో వచ్చిన 'వర్షం'.. ప్రేక్షకులను తనకు దగ్గర చేసింది. ప్రభాస్ కెరీర్ ప్రారంభమయ్యి 19 ఏళ్లు పూర్తయినందుకు తన అభిమానులు మరోసారి ప్రభాస్ సినీ కెరీర్‌ను గుర్తుచేసుకుంటున్నారు.

ప్రభాస్ ఆన్ స్క్రీన్ నటన గురించే కాదు.. ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయినా కూడా ఇప్పటికీ తన సహ నటీనటులతో, ఫ్యాన్స్‌తో చాలా స్నేహంగా ఉంటారు ప్రభాస్. అందుకే ఆయనను అందరు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు.

ఒక హీరో కెరీర్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు కేవలం ఒక్క సినిమా కోసమే ఐదేళ్లు కాల్ షీట్లు ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ప్రభాస్ ఆ సాహసం తీసుకున్నాడు. తరువాత తాను తీసుకున్న ఈ నిర్ణయం తన కెరీర్‌నే పూర్తిగా మార్చేసింది. ప్రభాస్ పేరు చెప్తేనే తెలుగు ఇండస్ట్రీలో గర్వపడేలా చేసింది. ప్రభాస్ కెరీర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి ముందు.. బాహుబలి తర్వాత అనేలా చేసింది.

బాహుబలి తర్వాత ప్రేక్షకులకు ప్రభాస్ సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకే కాస్త లేట్ అయినా అందరి అంచనాలను అందుకునేలాగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్. పైగా ప్రభాస్‌కు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వీటంతటికీ కారణం కూడా బాహుబలినే.

బాహుబలి కంటే ముందు ఎన్నో సినిమాల్లో స్టైలిష్ లుక్స్‌తో యూత్‌ను ఫిదా చేశారు ప్రభాస్. 'డార్లింగ్' లాంటి సినిమాల్లో ప్రభాస్ డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌ను అప్పట్లో చాలామందే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. 'రెబెల్' ఊహించినంత విజయాన్ని అందుకోకపోయినా అందులో ప్రభాస్ స్టైలిష్ లుక్స్‌కు మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి. 'మిర్చి'లో ప్రభాస్ ఫార్మల్ లుక్స్‌ను చాలామంది ఫాలో అయ్యారు.

ప్రభాస్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. కానీ తానెవరో అక్కడి వారికి పెద్దగా తెలియక ముందే ప్రభాస్ ఒక హిందీ చిత్రంలో ఒక సాంగ్‌లో తళుక్కున మెరిశాడు. అదే 'యాక్షన్ జాక్సన్'. ఈ సినిమాకు దర్శకుడు ప్రభుదేవా. ప్రభుదేవా, ప్రభాస్‌కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ప్రభుదేవా అడిగినందుకు యాక్షన్ జాక్సన్‌లోని ఒక పాటలో హీరోయిన్ సోనాక్షితో కలిసి చిందులేశాడు రెబెల్ స్టార్.

Next Story

RELATED STORIES