Prabhas: 'ఆదిపురుష్' రెమ్యునరేషన్ అదిరెన్..

Prabhas: ఆదిపురుష్ రెమ్యునరేషన్ అదిరెన్..
ప్రస్తుతం నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి.

Prabhas:పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్ చిత్రాలు భారీ స్థాయిలో ఉండి ప్రేక్షకులను అలరిస్తుంటాయి. బాహుబలితో తన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పెద్ద పెద్ద దర్శకులు ప్రభాస్ తో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఇటీవలే రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రవాంత్ నీల్ తో సలార్, తన్హాజీ ఫేం ఓ రౌత్ తో ఆదిపురుష్ చిత్రంలు షూటింగ్ దశలో ఉన్నాయి.

ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఆదిపురుష్ కోసం ప్రభాస్ భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని టీ సిరీస్ ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికిగాను ప్రభాస్ కి రూ.50 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.

ఇక మరో ముఖ్య పాత్ర రావణుడి క్యారక్టర్ ను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణ కథకు అనుకరణ ఆదిపురుష్. ఈ చిత్రం చేయాలనుకుంటున్న సమయంలో ఓ కార్యక్రమంలో ప్రభాస్ ని చూశాను. రాముని పాత్రకు అతడైతే కరెక్ట్ గా సరిపోతాడనిపించింది.

అతడి కళ్లు, వ్యక్తిత్వం, వైఖరి ఇవన్నీ నన్ను ఆకట్టుకున్నాయి. ఆ క్షణంలోనే ఆదిపురుష్ కి హీరో దొరికాడనుకున్నాను. ప్రభాస్ తో తప్ప ఇంకెవరితో ఈ సినిమా చేయలేననిపించింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. 2022 ఆగస్ట్ 11 న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఆదిపురుష్ విడుదలవనుంది.

Tags

Read MoreRead Less
Next Story