సినిమా

Radheshyam : అఫీషియల్.. 'రాధేశ్యామ్' వాయిదా

Radheshyam : దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్ర విడుదలని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు

Radheshyam : అఫీషియల్.. రాధేశ్యామ్ వాయిదా
X

Radheshyam : దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్ర విడుదలని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ''రాధేశ్యామ్‌ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు గడిచిన కొన్నిరోజుల నుంచి మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం. కానీ ఒమిక్రాన్‌, కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల రీత్యా చిత్రాన్ని వాయిదా వేయాల్సి వస్తోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి మీ ముందుకు వస్తాం'' అని టీమ్‌ తెలిపింది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటించింది. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.


Next Story

RELATED STORIES