Prabhas: 'వారి స్థానంలో నేనున్నా అలాగే ఆలోచిస్తాను'.. పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్

Prabhas (tv5news.in)

Prabhas (tv5news.in)

Prabhas: ప్రభాస్‌ చేతిలో ఉన్న అప్‌కమింగ్ సినిమాలను చూస్తుంటే తను మరో రెండు సంవత్సరాల వరకు ఫ్రీ అయ్యేలా కనిపించడం లేదు.

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కేవలం పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడు. ఎంతోకాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ తన పెళ్లి న్యూస్ ఎప్పుడెప్పుడు వింటామా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికీ ప్రభాస్ వీటిపై స్పందిస్తూనే ఉన్నా.. పెళ్లి ఎప్పుడు అనే విషయం క్లారిటీగా మాత్రం చెప్పలేదు. తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్న ఎదురయ్యింది.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' కోసం అయిదేళ్లు కేటాయించాడు ప్రభాస్. అదే తనను పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అందరూ ఆశించారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలపై అంచనాలు పెరిగిపోవడంతో తాను మరింత కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పెళ్లి కూడా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది.

ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఉన్న అప్‌కమింగ్ సినిమాలను చూస్తుంటే తను మరో రెండు సంవత్సరాల వరకు ఫ్రీ అయ్యేలా కనిపించడం లేదు. అంటే రెండేళ్ల వరకు పెళ్లి ప్రస్తావన కూడా అసాధ్యమే అన్నమాట. అయితే తాజాగా ప్రభాస్ తన పెళ్లిపై స్పందించాడు. దాని గురించి తన దగ్గర సమాధానం లేదని స్పష్టం చేశాడు.

తనకు తెలిసినప్పుడు తన పెళ్లి గురించి తానే అందరికీ చెప్తానని అన్నాడు ప్రభాస్. అందరూ తన పెళ్లి గురించే అడుగుతూ ఉన్నా.. తనకు ఎప్పుడూ చిరాకు అనిపించదని తెలిపాడు. తన గురించి అందరూ ఎంతలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోగలనని అన్నాడు. అలా అడగడం సాధారణ విషయమే అని, వారి స్థానంలో తాను ఉన్నా అలాగే ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్.

Tags

Read MoreRead Less
Next Story