Project K Prabhas: 'ప్రాజెక్ట్ కె' అప్డేట్.. ప్రభాస్‌కు జోడీగా మరో బాలీవుడ్ బ్యూటీ..

Project K Prabhas: ప్రాజెక్ట్ కె అప్డేట్.. ప్రభాస్‌కు జోడీగా మరో బాలీవుడ్ బ్యూటీ..
Project K Prabhas: ‘ప్రాజెక్ట్ కె’లో హీరోయిన్‌గా దీపికా పదుకొనె నటిస్తుండగా కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నాడు.

Project K Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చివరి చిత్రం 'రాధే శ్యామ్' అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవడంతో తన తరువాతి సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'ప్రాజెక్ట్ కె'. తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటికి వచ్చింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రం ఇదివరకు తెలుగు సినిమా ఎప్పుడూ చూడలేని టెక్నాలజీతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది టైమ్ మెషీన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న మూవీ అని ఇప్పటికే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాను టెక్నాలజీ పరంగానే కాకుండా క్యాస్టింగ్ పరంగా కూడా భారీగానే ప్లాన్ చేశాడు నాగ్ అశ్వి్న్.

'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనె నటిస్తుండగా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నాడు. అయితే ఇందులో మరో కీ రోల్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నట్టు తెలిసింది. ఇటీవల ప్రాజెక్ట్ కె సెట్స్‌లో అడుగుపెట్టిన దిశాకు.. మూవీ టీమ్ స్వాగతిస్తూ.. ఇచ్చిన బొకేను దిశా తన స్టోరీలో పెట్టింది. ఇప్పటికే 'సాహో' సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దిశా నటించాల్సి ఉన్నా.. అప్పుడు మిస్ అయిన ఛాన్స్ దిశాకు ఇప్పుడు దొరికింది.



Tags

Read MoreRead Less
Next Story