ఎన్టీఆర్ రీ-రిలీజ్ ఫిల్మ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

ఎన్టీఆర్ రీ-రిలీజ్ ఫిల్మ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్
పాత సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ విడుదల చేయడం టాలీవుడ్ లో మొదలైంది.

పాత సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ విడుదల చేయడం టాలీవుడ్ లో మొదలైంది. అది ఇప్పుడు మరికొన్ని ఇండస్ట్రీలకు పాకింది. రీ రిలీజ్ లు ఈ రోజుల్లో ట్రెండ్‌గా మారాయి. అభిమానులు థియేటర్లలో ఈ చిత్రాలను థియేటర్లలో అంతే ఉత్సాహంతో చూస్తున్నారు. ఒక్కరోజు షో అయినా నిర్మాతలకు భారీ మొత్తంలోనే కలెక్షన్లు వస్తున్నాయి. అయితే రీ-రిలీజ్‌ల ద్వారా సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం వివిధ మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామంగా ఇండస్ట్రీలోని పెద్ధలు అభివర్ణిస్తున్నారు.

టాలీవుడ్‌లో తదుపరి భారీ రీ-రిలీజ్ జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి. SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా 2003లో విడుదలైంది. భూమిక, అంకిత ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది ఈ చిత్రం.

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న సింహాద్రిని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా, ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్ అయిన విశ్వక్ సేన్ హాజరై అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.

పాత సినిమా రీ-రిలీజ్‌కి ఇది మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు హాజరవడం విశేషం. దర్శకులు హను రాఘవపూడి, గోపీచంద్ మలినేని, నిర్మాత నవీన్ ఎర్నేని పాల్గొన్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని సింహాద్రి సినిమాని వెయ్యి స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు.

మే 20 ఎన్టీఆర్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని మళ్లీ ఆ సినిమాని విడుదల (simhadri re release) చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుక (simhadri re release event)లో విశ్వక్‌తోపాటు దర్శకులు హను రాఘవపూడి, గోపీచంద్‌ మలినేని, నిర్మాత నవీన్‌ యెర్నేని పాల్గొన్నారు.

రీ రిలీజ్‌ సినిమాకు ఫంక్షన్‌ జరగడం ఇదే తొలిసారి అని గోపీచంద్‌ మలినేని అన్నారు. ఆ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story