Beast: ఏప్రిల్ 13 హాలిడే.. ఎందుకో తెలుసా!!

Beast: ఏప్రిల్ 13 హాలిడే.. ఎందుకో తెలుసా!!
Beast: ఏప్రిల్ 13న నాలుగు కంపెనీలు అధికారికంగా సెలవు ప్రకటించాయని ఓ అభిమాని వెల్లడించారు.

Beast: పర్సనల్ పనులు కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ షోకి వెళ్లాల్సిందే.. ఆ హీరో అంటే అంత అభిమానం మరి.. ఏప్రిల్ 13న బీస్ట్ రిలీజ్ అవుతుంటే ఆఫీస్ లో కూర్చుని పనెలా చేస్తారు.. అందుకే ఎంచక్కా సెలవు తీసుకుని సినిమా ఎంజాయ్ చేయమంటూ తమిళనాడులోని కొన్ని ప్రైవేట్ ఆఫీసులకు సెలవు ప్రకటించారు.

విజయ్, పూజా హెగ్డే నటించిన బీస్ట్ చిత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం తెరపై చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.

అభిమానులు, సినీ ప్రేమికులు సినిమాని మొదటి రోజు చూసేందుకు ఎగబడుతున్నారు. ఇప్పుడు బెంగుళూరు, చెన్నైలోని ప్రైవేట్ కంపెనీలు బీస్ట్ చూడటానికి తమ ఉద్యోగులకు ఏప్రిల్ 13 న సెలవు ప్రకటించాయి.

వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు భారీ సంఖ్యలో సెలవు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. సిక్ లీవ్‌ పేరుతో వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. వీళ్లందరికీ విజయ్‌పై ఉన్న క్రేజ్‌తో పాటు తమ అభిమాన తారను తొలిరోజే తెరపై చూడాలనే తపన.

కాబట్టి, చాలా ప్రైవేట్ కంపెనీలు విడుదల రోజున సెలవు ప్రకటించాయి. విజయం సినిమా రిలీజ్ అంటే సౌత్ ఇండియా మొత్తం ఒక సెలబ్రేషన్ లాంటిదే. అందుకే ఆ రోజున ఉద్యోగులు సంబరాలు చేసుకునేందుకు సెలవు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఏప్రిల్ 13న నాలుగు కంపెనీలు అధికారికంగా సెలవు ప్రకటించాయని ఓ అభిమాని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story