సినిమా

Prabhas Project K: 'ప్రాజెక్ట్ కె' చిత్రం రిలీజ్ డేట్‌ను బయటపెట్టేసిన నిర్మాత..

Prabhas Project K: ప్రాజెక్ట్ కెకు నిర్మాతగా వ్యవహరిస్తున్న అశ్విని దత్.. ఈ సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

Prabhas Project K: ప్రాజెక్ట్ కె చిత్రం రిలీజ్ డేట్‌ను బయటపెట్టేసిన నిర్మాత..
X

Prabhas Project K: ప్రభాస్.. ఈ పేరు ఇప్పుడు కేవలం టాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్. ప్రభాస్ సినిమాల కోసం ప్రపంచ నలుమూలల నుండి ఎంతోమంది మూవీ లవర్స్ ఎదరుచూస్తూ ఉంటారు. అందుకే యంగ్ రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ పాన్ ఇండియా స్టార్ పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్న చిత్రమే 'ప్రాజెక్ట్ కె'. ఇటీవల ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు నిర్మాత అశ్వినీ దత్.

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. కానీ వాటన్నింటికంటే ముందే సైన్ చేసిన సినిమా 'ప్రాజెక్ట్ కె'. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. 'సాహో' తర్వాత ప్రభాస్ ముందుగా 'రాధే శ్యామ్' షూటింగ్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత వెంటనే ప్రాజెక్ట్ కెకు ఓకే చెప్పేశాడు. దాని తర్వాతే సలార్, ఆదిపురుష్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రాజెక్ట్ కె కంటే తర్వాత సైన్ చేసిన సినిమాలే సెట్స్‌పైకి వెళ్లాయి. అందులో ఆదిపురుష్ అయితే షూటింగ్ కూడా పూర్తిచేసేసుకుని గ్రాఫిక్స్ పనిని ప్రారంభించేసింది. కానీ ప్రాజెక్ట్ కె షూటింగ్ ప్రారంభం కావడానికి మాత్రం ఇంత టైమ్ పట్టింది. కొన్నిరోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకుంది. క్వాలిటీ విషయంలో ప్రాజెక్ట్ కె.. ఏ మాత్రం తగ్గకూడదని ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా ప్లాన్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

ప్రాజెక్ట్ కెకు నిర్మాతగా వ్యవహరిస్తున్న అశ్విని దత్.. ఇటీవల ఈ సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయినా కూడా.. దీనికి చాలా గ్రాఫిక్స్ వర్క్ అవసరమని, ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకులు చూడని సినిమా అవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అయితే అన్ని పనులు పూర్తి చేసుకుని 2023 ఏప్రిల్ లేదా మేలో ప్రాజెక్ట్ కె ప్రేక్షకుల ముందుకు రానుందని అశ్విని దత్ స్పష్టం చేశారు.

Next Story

RELATED STORIES