సినిమా

Puneeth Rajkumar: దేవుడు నన్ను తీసుకెళ్లినా బావుండేది: శరత్‌కుమార్ కన్నీటి పర్యంతం

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ అభిమానులను వీడి అప్పుడే నెల రోజులు కావొస్తుంది. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటోంది శాండల్‌వుడ్.

Puneeth Rajkumar: దేవుడు నన్ను తీసుకెళ్లినా బావుండేది: శరత్‌కుమార్ కన్నీటి పర్యంతం
X

Puneeth Rajkumar: ప్రజల హృదయాల్లో కొందరు వ్యక్తులు దేవుళ్లుగా మిగిలిపోతారు. కానీ అలాంటి వారే త్వరగా వెళ్లిపోతారు. మంచి మనుషులను ఎక్కువకాలం ఉంచడని అంటారు.. అందుకేనేమో. పునీత్ రాజ్‌కుమార్ అభిమానులను వీడి అప్పుడే నెల రోజులు కావొస్తుంది. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటోంది శాండల్‌వుడ్.

తాజాగా 'పునీత్ నామన' పేరుతో కన్నడ సినీ పరిశ్రమ బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో భారీ సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, తమిళ నటులు శరత్ కుమార్, విశాల్ తదితరులు హాజరయ్యారు.

అలాగే టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వారంతా పునీత్‌కు నివాళులు అర్పించి, ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పునీత్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

తమిళ నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ.. దేవుడు పునీత్‌ బదులు తనని తీసుకెళ్లినా బాగుండేదని కన్నీరు పెట్టుకున్నారు. విశాల్ సైతం పునీత్ చదివిస్తున్న 1800 పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని, ఇది తనకు అప్పగించాల్సిందిగా పునీత్ కుటుంబసభ్యులకు విజ్ఞప్తి చేశాడు.

Next Story

RELATED STORIES