Puneet Rajkumar: రాజ్‌కుమార్ ఇల్లు మ్యూజియంగా.. మామ కల నెరవేరుస్తున్న మేనల్లుడు

Puneet Rajkumar: రాజ్‌కుమార్ ఇల్లు మ్యూజియంగా.. మామ కల నెరవేరుస్తున్న మేనల్లుడు
Puneet Rajkumar: తమిళనాడు సందర్శించే పర్యాటకులకు ఇది అదనపు ఆకర్షణగా ఉంటుంది

Puneet Rajkumar: గాజనూర్‌లోని తన పూర్వీకుల ఇంటిని చారిత్రక కేంద్రంగా మార్చాలనే దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కోరిక నెరవేరబోతోంది. పునీత్ మరణానికి ముందు నాలుగు నెలల క్రితం ఇంటిని సందర్శించాడు. గ్రామస్తులతో ఆప్యాయంగా మాట్లాడి వారితో కొంత సమయాన్ని గడిపాడు. తాత, తండ్రి నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చాలనే తన కోరికను తెలియజేసాడు. కానీ ఇంతలోనే అతడిని మృత్యువు కబళించింది. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పునీత్ రాజ్‌కుమార్ చివరి కోరికను తీర్చే ప్రయత్నంలో పడ్డారు మేనల్లుడు గోవింద్.



భారీ వర్షాలు కురవడంతో ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఇంటికి భారీ నష్టం వాటిల్లింది. కార్మికులను నియమించి పనులను వేగవంతం చేశాడు గోపాల్. కొన్ని నెలల్లో ఆ ఇల్లు మ్యూజియంగా మారిపోనుంది. పునీత్ సోదరులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ త్వరలో పట్టణాన్ని సందర్శించి పనులను పర్యవేక్షిస్తారు.

ఇల్లు శిధిలావస్థకు చేరుకోవడం మమ్ములను బాధకలిగించింది. కన్నడిగుల స్మృతిలో చిరస్థాయిగా నిలిచిపోయే బంగారు జ్ఞాపకాలు ఇందులో ఉన్నాయి. మేము సాంప్రదాయ పద్ధతిలో ఉంటే స్తంభాలు, పెంకులను ఉపయోగించి ఇంటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాము అని అంటున్నారు గోపాల్. పని పూర్తయిన తర్వాత డా. రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ చిత్రాలతో పాటు వారి కుటుంబ సభ్యుల అరుదైన ఛాయాచిత్రాలను గోడలపై వేలాడదీయడం జరుగుతుంది. ఇది భవిష్యత్ తరాలకు కూడా ఇంటిని సంరక్షించడానికి సహాయపడుతుంది అని ఆయన చెప్పారు.



తమిళనాడు సందర్శించే పర్యాటకులకు ఇది అదనపు ఆకర్షణగా ఉంటుంది అని మరో గ్రామస్తుడు రమేష్ తెలిపాడు. డా. రాజ్‌కుమార్ మనవడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుమారుడు అయిన వినయ్ రాజ్‌కుమార్ తన రాబోయే చిత్రం గ్రామాయాణ కోసం ఇక్కడ కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. ఇది ఒక గ్రామం నేపథ్యంలో తీస్తున్న చిత్రం.

Tags

Read MoreRead Less
Next Story