సినిమా

Pushpa Movie: 'పుష్ప' ప్రీ రిలీజ్‌లో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ స్టార్లు..

Pushpa Movie: పాన్ ఇండియా సినిమాలకు ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Pushpa Movie (tv5news.in)
X

Pushpa Movie (tv5news.in)

Pushpa Movie: పాన్ ఇండియా సినిమాలకు ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమా రీచ్ అవ్వాలంటే వారికి ఆసక్తికలిగే అంశాలు సినిమాలో ఉన్నాయని నిరూపించడం మాత్రమే కాదు.. ప్రమోషన్స్‌లో కూడా కొత్తదనాన్ని చూపించాలి. ప్రస్తుతం 'పుష్ప' మూవీ టీమ్ అదే ప్రయత్నంలో ఉంది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా ప్రతీ అంశంలో కొత్తదనాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. అప్డేట్స్‌ను ఇవ్వడంలో, ప్రమోషన్స్ చేయడంలో అన్నింటిలో దూసుకుపోతోంది. ఈరోజు ట్రైలర్ విడుదల చేసిన పుష్ప టీమ్.. ఓ అదిరిపోయే న్యూస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతున్న పుష్పకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నరట సుకుమార్. డిసెంబర్ 17న పుష్ప థియేటర్స్‌లో విడుదలకు సిద్ధమవుతుండగా డిసెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కోసం ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలను ఛీఫ్ గెస్ట్‌లుగా పిలవనున్నారట సుకుమార్.

ముందుగా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ మాత్రమే కాదని మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ కూడా పుష్ప ప్రీ రిలీజ్‌కు ఛీఫ్ గెస్ట్‌లుగా రానున్నట్టు సమాచారం. ఈ వార్త నిజమయితే.. ఇంతమంది స్టార్ హీరోలను ఒకే వేదికపై చూస్తున్న మ్యుచువల్ ఫ్యాన్స్‌కు పండగే.

Next Story

RELATED STORIES