సినిమా

Pushpa: 'పుష్ప' ప్రీ రిలీజ్ బిజినెస్.. బాహుబలి రికార్డ్ బ్రేక్

Pushpa: సినిమాకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో సాగింది.

Pushpa: పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్.. బాహుబలి రికార్డ్ బ్రేక్
X

Pushpa: అల్లు అర్జున్-సుకుమార్ క్రేజీ కాంబోలో రాబోతున్న ప్రెస్టీజియస్ మూవీ 'పుష్ప'. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం. ఈ సినిమా మొత్తం రెండు భాగాలు. కాగా, మొదటి భాగాన్ని డిసెంబర్ 17న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన అప్ డేట్స్ అన్నిటికీ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది.

దీంతో సినిమాకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో సాగింది. అన్ని ఏరియాల్లో ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఏరియా రైట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు సమాచారం. ట్రేడ్ గ్రూప్ లెక్కల ప్రకారం పుష్ప ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 144.90 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 101.75 కోట్లు.

ఏరియాల వారీగా 'పుష్ప' ప్రీ-రిలీజ్ బిజినెస్ రిపోర్ట్

నైజాం: 36 కోట్లు

సీడెడ్: 18 కోట్లు

ఉత్తరాంధ్ర: 12.25 కోట్లు

తూర్పు గోదావరి: 8 కోట్లు

పశ్చిమ గోదావరి: 7 కోట్లు

గుంటూరు: 9 కోట్లు

కృష్ణా: 7.5 కోట్లు

నెల్లూరు: 4 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలో కలిపి మొత్తం 101.75 కోట్లు

కర్ణాటకలో 9 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 4 కోట్లు, హిందీలో 10 కోట్లు, ఓవర్సీస్‌లో 13 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 144.90 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా బరిలోకి దిగుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక ప్రీ-రిలీజ్ సినిమాల్లో 'పుష్ప' నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కంటే బాహుబలి 2, సాహో, సైరా నరసింహారెడ్డి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా ఉంది. అయితే బాహుబలి 1 రికార్డును 'పుష్ప' అధిగమించింది.

Next Story

RELATED STORIES