Pushpa Raj: పుష్పరాజ్‌ని చూసి పులి కూడా నాలుగడుగులు వెనక్కి..

Pushpa Raj: పుష్పరాజ్‌ని చూసి పులి కూడా నాలుగడుగులు వెనక్కి..
Pushpa Raj: అల్లు అర్జున్ మేనియా ఇప్పుడు దేశమంతా కనిపిస్తోంది. అతడి నుంచి ఓ సినిమా వస్తోందంటే చాలు.. ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లోనూ ఓ క్రేజ్ కనిపిస్తోంది.

Pushpa 2: అల్లు అర్జున్ మేనియా ఇప్పుడు దేశమంతా కనిపిస్తోంది. అతడి నుంచి ఓ సినిమా వస్తోందంటే చాలు.. ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లోనూ ఓ క్రేజ్ కనిపిస్తోంది. ఆ క్రేజ్ ను క్యాష్‌ చేసుకునే కథలతోనే వస్తున్నాడు ఈ ఐకాన్ స్టార్. లాస్ట్ ఇయర్ ఇదే టైమ్ లో వచ్చిన పుష్పతో ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.



ఈ మూవీని రీసెంట్ గా రష్యాలో కూడా విడుదల చేసిన ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. ఈ సీక్వెల్ కు సంబంధించి అవతార్ తో కనెక్ట్ చేసి ఓ గ్రేట్ న్యూస్ చెప్పింది మూవీ టీమ్. పుష్ప2కు అవతార్ కు సంబంధం ఏంటీ అనుకుంటున్నారు కదా.. జస్ట్ వాచ్ దిస్.


పుష్ప ది రైజ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అల్లు అర్జున్, సుకుమార్. ఈ మూవీకి ఎన్నో అంశాలు ప్లస్ అయ్యాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ నుంచి సమంత ఐటమ్ సాంగ్ వరకూ.. సుకుమార్ టేకింగ్ నుంచి.. అల్లు అర్జున్ అద్భుత నటన వరకూ అన్నీ పాజిటివ్ గా ఉండటంతో బాక్సాఫీస్ షేక్ అయింది. స్టైలిష్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ఉన్న అల్లు అర్జున్ ఈ మూవీతో ఫస్ట్ టైమ్ ఏకంగా డీ గ్లామర్ రోల్ చేయడం సాహసమే.



ఆ సాహసానికి రిజల్టే ఇప్పుడీ మూవీకి వస్తోన్న సీక్వెల్. ఓ రకంగా పుష్ప2 రావాలి అన్న డిమాండ్ కూడా ఉంది. అయితే మొదట ఈ చిత్రానికి సీక్వెల్ లేదు. పుష్పకు వచ్చిన క్రేజ్ వల్ల రెండో భాగం తీయాలనుకున్నారు. అందుకోసం కథ కావాలి కదా..? అది కూడా ఫస్ట్ పార్ట్ ను మించి అనేలా ఉండాలి. అందుకే సుకుమార్ అండ్ టీమ్ సీక్వెల్ స్టోరీ కోసం అనుకున్నదానికంటే ఎక్కువే టైమ్ తీసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆ మధ్య ప్రొడక్షన్ హౌస్ ముందు ధర్నా చేశారు.



పుష్ప2 అప్డేట్ చెప్పాలని డిమాండ్స్ చేశారు. ఫైనల్ గా ఆ అప్డేట్ వచ్చింది. అవతార్ మూవీ రిలీజ్ అయ్యే థియేటర్స్ లో ఈ సెకండ్ పార్ట్ కాన్సెప్ట్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఆ టీజర్ లో పుష్పరాజ్ అంటే పులి కూడా భయపడుతుందనే డైలాగ్ తో కూడిన వీడియో ఉండబోతోందట.



అంటే అడవిలో జంతువులు నాలుగడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. పులి కూడా నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే.. పుష్పరాజ్ వచ్చాడని అర్థం అనే డైలాగ్ తో హైప్ పెంచబోతున్నారు. ఈ నెల 17నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. సో ఇక పుష్పరాజ్ సందడి మొదలైనట్టే అనుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story