సినిమా

Radhe Shyam: 'నేను రోమియోని కాదు.. కానీ నేను జూలియట్‌నే'.. రాధే శ్యామ్ నుండి మరో మెలోడీ..

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న అందమైన ప్రేమకథ ‘రాధేశ్యామ్’.

Radhe Shyam (tv5news.in)
X

Radhe Shyam (tv5news.in)

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న అందమైన ప్రేమకథ 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. సంక్రాంతి బరిలో ఇప్పటివరకు అన్ని కమర్షియల్ సినిమాలే ఉన్నాయి. వాటన్నిటికి పోటీగా ఒక పీరియాడిక్ ప్రేమకథతో ప్రభాస్ వారికి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

రాధే శ్యామ్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడు ఆతృతగా ఎదురుచూస్తూనే ఉంటారు. అయినా నిర్మాణ సంస్థ యూవీ ఇప్పటివరకు పెద్దగా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్‌ను చూపించలేదు. కానీ విడుదల తేదీ దగ్గర పడింది. ఇప్పటికీ ప్రమోషన్స్ మొదలుపెట్టకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంటుంది. అందుకే రాధే శ్యామ్ టీమ్ అలర్ట్ అయ్యింది.

రాధే శ్యామ్ నుండి ఇటీవల 'ఈ రాతలే' అనే మెలోడీ పాట విడుదలయ్యింది. చాలా స్లోగా సాగిపోయే ఈ పాట.. ఇప్పటికే చాలామంది మెలోడీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రాతలే హ్యాంగ్ ఓవర్ నుండి బయటపడక ముందే 'ఆషిఖీ ఆగయి' అనే పాటను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పాట వినడానికి మాత్రమే కాదు.. చూడడానికి కూడా చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తోంది.

'నేను రోమియేను కాదు' అంటూ మరోసారి గ్లింప్స్‌లో చెప్పిన డైలాగునే రిపీట్ చేశాడు ప్రభాస్. దానికి సమాధానంగా పూజా హెగ్డే.. 'కానీ నేను జూలియట్‌నే. నన్ను ప్రేమిస్తే కచ్చితంగా చచ్చిపోతారు' అంటుంది. ప్రభాస్ తనకు రిలేషన్‌షిప్ వద్దని ఫ్లర్టేషన్‌షిప్ మాత్రమే కావాలంటూ కొత్త రిలేషన్‌షిప్‌ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత వచ్చే వారి కెమిస్ట్రీతో వచ్చే 'ఆషిఖీ ఆగయి' పాట చాలా చూడముచ్చటగా ఉంది.

Next Story

RELATED STORIES