సినిమా

Radhe Shyam Teaser: రాధే శ్యామ్ అప్డేట్.. టీజర్ తెలుగులో కాదట..

Radhe Shyam Teaser: పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ సినిమాల్లో స్పీడ్ తగ్గింది.

Radhe Shyam Teaser (tv5news.in)
X

Radhe Shyam Teaser (tv5news.in)

Radhe Shyam Teaser: పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ సినిమాల్లో స్పీడ్ తగ్గింది. బాహుబలి తర్వాత అయినా ప్రభాస్ వెంటవెంటనే సినిమాలు చేస్తాడు అనుకున్న వారికి కూడా నిరాశే మిగిలింది. యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో చేసిన సాహోకు దాదాపు రెండు సంవత్సరాలు కేటాయించాడు ప్రభాస్. దీంతో ఆయన ఫ్యాన్స్ కోరిక మేరకు వరుసగా సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ రెబెల్ స్టార్.ఇప్పటికే ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అన్ని సినిమాల షూటింగ్స్‌ను ఒకేసారి మ్యానేజ్ చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నాడు. కానీ అందులో ఏ ఒక్క మూవీ నుండి కూడా ఫ్యాన్స్‌కు సరైన అప్డేట్ లేదు. అన్నింటిలో ముందుగా మొదలయిన సినిమా 'రాధే శ్యామ్'. పండగలకు, పుట్టినరోజులకు పోస్టర్లు విడుదల చేయడమే కానీ.. ఇప్పటికీ రాధే శ్యామ్ టీమ్ సరైన వీడియోను విడుదల చేయలేదు. గ్లింప్స్‌ను విడుదల చేసి కూడా చాలాకాలమే అయ్యింది.తాజాగా అక్టోబర్ 23న 'రాధే శ్యామ్' టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఆరోజు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో తాను నటిస్తున్న ఆదిపురుష్, సలార్ నుండి కూడా ఏదో ఒక అప్డేట్ ఉండవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆదిపురుష్ షూటింగ్ త్వరత్వరగా పూర్తవుతోంది కాబట్టి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఫ్యాన్స్.


రాధే శ్యామ్ టీజర్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన మూవీ టీమ్.. దాంతో పాటు సినిమా విడుదల తేదీలో ఏ మార్పు లేదని కూడా స్పష్టం చేసింది. అక్టోబర్‌లో విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్‌' సంక్రాంతికి పోస్ట్‌పోన్ అవ్వడంతో మిగతా సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం ఉందనుకున్నారు మూవీ లవర్స్. కానీ ఆర్ఆర్ఆర్‌తో తలబడడానికి రాధే శ్యామ్ సిద్ధమయ్యింది. ఇక టీజర్‌ను అనౌన్స్ చేస్తూ విక్రమాదిత్య ఎవరో తెలుసుకోవాలంటే 23 వరకు ఆగమని డైరెక్టర్ రాధాకృష్ణ అన్నాడు.


అయితే.. రాధే శ్యామ్ తెలుగులో నేరుగా విడుదల కాదట. టీజర్ ఇంగ్లీషులో ఉండగా ఇతర భాషల సబ్ టైటిల్స్‌తో దీనిని రిలీజ్ చేస్తుందట మూవీ టీమ్. ఏదైతే ఏంటి ఇన్నాళ్లకు రాధే శ్యామ్ అప్డేట్ వచ్చిందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Next Story

RELATED STORIES