సినిమా

Radhe Shyam: 'రాధే శ్యామ్ ట్రైలర్ ఆశించినంతగా లేదు'.. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ నెగిటివ్ కామెంట్..

Radhe Shyam: ట్రైలర్‌పై చాలామంది పాజిటివ్ కామెంట్స్ ఇస్తుంటే.. కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ కూడా ఇస్తున్నారు.

Radhe Shyam: రాధే శ్యామ్ ట్రైలర్ ఆశించినంతగా లేదు.. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ నెగిటివ్ కామెంట్..
X

Radhe Shyam: రాధే శ్యామ్ సినిమా గురించి ప్రేక్షకుల పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల ఫ్యాన్స్ చేతుల మీదుగా గ్రాండ్‌గా విడుదల చేయించింది మూవీ టీమ్. ఇక ఈ ట్రైలర్‌పై చాలామంది పాజిటివ్ కామెంట్స్ ఇస్తుంటే.. కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ కూడా ఇస్తున్నారు.

ఒకప్పుడు తెలుగు సినిమాలకు, హిందీ సినిమాలకు మధ్య ఓ పోటీ నడిచేది. కానీ ఇప్పుడు ఆ పోటీనంతా పక్కన పెట్టి ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఇంకా కొందరు మాత్రం నువ్వు గొప్పా? నేను గొప్పా? అనే పంతాన్ని వదలట్లేదు. అందుకే ఓ సినిమా విడుదలయిన వెంటనే దానిపై నెగిటివిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

రాధే శ్యామ్ ట్రైలర్ ఓ విజువల్ వండర్ అని చాలామంది ప్రేక్షకులు అంటున్నారు. ఓ ప్రేమకథకు ఇలాంటి హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ట్రైలర్ కేవలం విజువల్స్ మీదే దృష్టిపెట్టిందని నెగిటివ్‌గా కామెంట్ చేశాడు రోహిత్ జైస్వాల్ అనే బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్.

రాధే శ్యామ్ ట్రైలర్‌తో తాను హ్యాపీగా లేనని, ట్రైలర్ చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంది అన్నాడు రోహిత్. అది ఇంకా బాగుంటుందని తాను ఆశించానని చెప్పాడు. ఈ ట్రైలర్‌లో లీడ్ పెయిర్, లొకేషన్స్ తప్పా ఆ ఛార్మ్ కనిపించట్లేదన్నాడు. ప్రభాస్ స్టార్‌డమ్ పైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉందని పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌ను చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ రోహిత్ మీద ఫైర్ అవుతున్నారు.


Next Story

RELATED STORIES