జైలర్ బ్లాక్ బస్టర్.. డబుల్ రెమ్యునరేషన్, BMW X7 కారు

జైలర్ బ్లాక్ బస్టర్.. డబుల్ రెమ్యునరేషన్, BMW X7 కారు
ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుంది. 70 ఏళ్లు పై బడినా నటనలో రికార్డులు సృష్టిస్తున్నారు.

ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుంది. 70 ఏళ్లు పై బడినా నటనలో రికార్డులు సృష్టిస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. ఇప్పటికీ తన సినిమా కోసం ఎదురు చూడ్డంలో ఫ్యాన్స్ ఆనందం పొందుతున్నారంటే అది రజనీకాంత్ కి మాత్రమే సొంతమైన నటన, మ్యానరిజమ్.. అన్నిటికీ మించి ఆయన వ్యక్తిత్వం. ఎదిగిన కొద్దీ ఒదిగి వుండే మనస్థత్వం అభిమానులను మరిత చేరువ చేస్తుంది.

ఆయన నటించిన తాజా చిత్రం జైలర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-డ్రామా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా కోసం రజనీకాంత్ ‘డబుల్ రెమ్యునరేషన్’ అందుకున్నారు. ఆ విషయం గురించే ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నారు.

విశేషమేమిటంటే, 'జైలర్' విడుదలైన నాలుగు రోజుల్లోనే దాని మీద పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసింది. ఇక లాభాల విషయానికి వస్తే, జైలర్ రూ. 620 కోట్ల గ్రాస్ మరియు రూ. పైగా షేర్. థియేటర్లలో మూడు వారాల రన్ లో 280 కోట్లు సంపాదించింది.

ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించడం వల్ల సినిమా నిర్మాతలకు రూ.150 కోట్లు అదనంగా వచ్చాయి. అందుకే నిర్మాత కళానిధి మారన్ రజనీకాంత్ కి కూడా అదనంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

"జైలర్"లో తన పాత్రకు రజనీ 100 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా ఇప్పుడు అదనపు చెక్కును అందించారు. అంతే కాకుండా, నిర్మాత రజనీకాంత్‌కు ప్రేమతో మరో గిప్ట్ ను కూడా అందించారు. సరికొత్త కారును కూడా బహుమతిగా ఇచ్చారు. BMW X7 ఇచ్చి రజనీ మనసు దోచుకున్నారు.

జైలర్‌లో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, రమ్య కృష్ణన్, వసంత్ రవి తదితరులు నటించారు.



Tags

Read MoreRead Less
Next Story