రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్‌!

రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్‌!

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మూవీ తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీకపూర్‌ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత పేరు వినిపించినా జాన్వీకపూర్‌ (Janhvikapoor) ను ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక, రామ్‌చరణ్‌ శంకర్‌ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తోంది. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు.. గేమ్ చేంజర్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గేమ్ చేంజర్ క్లైమాక్స్ ఫైట్ సుమారు 1200 మందితో రూపొందింది.

Tags

Read MoreRead Less
Next Story