సినిమా

Ram Charan: తాతకు సంబంధించిన టాప్ సీక్రెట్ మనవడు రివీల్..

Ram Charan: మా తాత అల్లు రామలింగయ్య గొప్ప నటుడు.. అది అందరికీ తెలిసిన విషయమే..

Ram Charan: తాతకు సంబంధించిన టాప్ సీక్రెట్ మనవడు రివీల్..
X

Ram Charan: మా తాత అల్లు రామలింగయ్య గొప్ప నటుడు.. అది అందరికీ తెలిసిన విషయమే.. కానీ చాలా మందికి తాత గురించి తెలియని మరో విషయం ఉంది.. అది ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారు.

అందుకు ఆయన్ని 15 రోజులకు పైగా జైల్లో పెట్టారు. కుటుంబసభ్యుల్లోని కొంతమందికి మాత్రమే ఈ విషయం తెలుసు అని తాత గురించి రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చరణ్ బిజీగా ఉన్నాడు.

కాగా, RRRలో, రామ్ చరణ్ బ్రిటీష్ రాజ్‌కు వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామ రాజుగా నటించాడు. ఈ చిత్రంలో తాను "మూడు విభిన్న పాత్రలు" పోషించానని తెలిపాడు. "కథలో నా పాత్ర మూడు విభిన్న రూపాలుగా పరిణామం చెందేలా చేస్తుంది" అని చరణ్ వెల్లడించాడు.

చరణ్, రాజమౌళి కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది.. 2009లో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన మగధీర ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే.

రాజమౌళితో తన సంబంధాన్ని వివరిస్తూ.. "సెట్‌లో ఏ నటుడైనా అతడి నుండి చాలా నేర్చుకోవచ్చు. అది పాత్ర గురించి కావచ్చు, అతడికి పనిపట్ల ఉన్న అంకితభావం గురించి కావచ్చు అని చెప్పుకొచ్చాడు.. అతడితో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉందని పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story

RELATED STORIES