ఉపాసన పుట్టినరోజు.. రామ్ చరణ్ ఎమోషనల్ వీడియో..

ఉపాసన పుట్టినరోజు.. రామ్ చరణ్ ఎమోషనల్ వీడియో..
ఉపాసన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ బేబీ క్లిన్ కారాను పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగ వీడియోను పంచుకున్నారు.

ఈరోజు జూలై 20న ఉపాసన కామినేని కొణిదెల పుట్టినరోజు. ఇది ప్రత్యేకంగా ఆమెకు ప్రత్యేకమైన పుట్టినరోజు, ఎందుకంటే క్లిన్ కారా పుట్టిన తరువాత ఇది ఆమెకు మొదటి పుట్టిన రోజు. చాలా ప్రత్యేకమైన రోజు కూడా.

హృదయాన్ని కదిలించే వీడియోలో పాప పుట్టడానికి ముందు, తరువాత జంట వారి కుటుంబం యొక్క భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన కూడా తమ గర్భధారణ ప్రయాణం గురించి మాట్లాడుకోవడం.. ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఉంది.

కొత్త తల్లిదండ్రులు రామ్ చరణ్ మరియు ఉపాసన కొణిదెల తమ కుమార్తె క్లిన్ కారా కొణిదెల ఆనందకరమైన రాకను డాక్యుమెంట్ చేస్తూ వీడియోను పంచుకున్నారు.

క్లిన్ కారా వారి జీవితంలోకి వచ్చి అప్పుడే ఒక నెల అయిపోయింది. ఇదే రోజు ఉపాసన పుట్టిన రోజు కూడా కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్ వీడియో షేర్ చేశారు.

రామ్ చరణ్ తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ అలాగే ఉపాసన తల్లిదండ్రులు, శోభన, అనిల్ కూడా ఉన్న ఈ వీడియో కుటుంబం మొత్తం క్లిన్ కారా పుట్టిన క్షణం ఆనందంతో ఉప్పొంగిన సందర్భాన్ని కూడా ఈ వీడియోలో పొందు పరిచారు.

వీడియో ఆమె పేరు వెనుక ఉన్న ఆకర్షణీయమైన కథను కూడా వెల్లడిస్తుంది. ఈ జంట భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలో నివసిస్తున్న ద్రావిడ సమాజమైన చెంచు తెగల నుండి ప్రేరణ పొందారు. వారి గొప్ప సంస్కృతి, విలువలు పేరు ఎంపికను ప్రభావితం చేశాయి.

ఈ వీడియోలో ఉపాసన మాట్లాడుతూ, “నా బిడ్డ చెంచులలో భాగం కావాలని కోరుకుంటున్నాను. పిల్లల వెనుక నాకు ఎలాంటి ట్యాగ్‌లు అక్కర్లేదు. వారు తమ సొంత ఐడెంటీని సంపాదించుకోవాలని నేను భావిస్తున్నాను. ఇది పిల్లల పెంపకంలో చాలా ముఖ్యమైనది. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందించాలి. మనం కలిసి గడిపిన అన్ని సంతోషకరమైన సమయాలకు మనం విలువ ఇవ్వాలని నేను భావిస్తున్నాను.

రామ్ చరణ్, ఉపాసనల వివాహం అయిన11 సంవత్సరాల తర్వాత జూన్ 20 న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు ఈ దంపతులు. కుటుంబ సభ్యులే కాదు, రామ్ చరణ్ అభిమానులు కూడా చిన్నారి రాకను ఆస్వాదించారు. ఆనందంతో ఉప్పొంగిపోయారు.



Tags

Read MoreRead Less
Next Story