Ram Gopal Varma: మరోసారి టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన వర్మ.. అందరికీ ఇదే పరిస్థితి అంటూ..

Ram Gopal Varma: మరోసారి టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన వర్మ.. అందరికీ ఇదే పరిస్థితి అంటూ..
Ram Gopal Varma: ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన తాజా ట్వీట్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులను టార్గెట్ చేశాడు.

Ram Gopal Varma: ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన తాజా ట్వీట్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులను టార్గెట్ చేశాడు. ప్రముఖ టాలీవుడ్ నటుడు కృష్ణం రాజు ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఆదివారం మృతి చెందారు. సినీ ప్రముఖులు, ఇతర నటీనటులు ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించారు.

కృష్ణంరాజుకు సినీ పరిశ్రమ సరైన వీడ్కోలు ఇవ్వలేదని వర్మ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ఇది అత్యంత స్వార్థపూరిత సినీ పరిశ్రమ అని వర్మ విరుచుకుపడ్డారు. కృష్ణంరాజుకు గౌరవ సూచకంగా కనీసం రెండు రోజుల పాటు సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని ఆయన కోరారు.

'భక్త కన్నప్ప', 'కటకటాల రుద్రయ్య' వంటి గొప్ప చిత్రాలను అందించిన కృష్ణంరాజు లాంటి గొప్ప నటుడి కోసం ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపుకోలేని స్వార్థపూరితమైన తెలుగు సినీ పరిశ్రమకు నా నివాళులు' అంటూ ట్వీట్ చేశారు. బొబ్బిలి బ్రహ్మన్న', 'తాండ్ర పాపారాయుడు'.. లాంటి చిత్రాల్లో కృష్ణం రాజు తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. కృష్ణ, మురళీమోహన్, చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య, ప్రభాస్, మహేష్, కళ్యాణ్ లకు ఈ విషయంపై మనవి చేస్తున్నాను. భవిష్యత్తులో అందరికి ఇదే పరిస్థితి వస్తుంది."

"గొప్ప కళాకారుడికి ఇవ్వలేని గొప్ప వీడ్కోలు మన మీద మనమే ఉమ్మివేయడం లాంటిది.. నీకు బుద్ధి లేకపోయినా ఫర్వాలేదు.. కనీసం చావుకైనా విలువ ఇద్దాం. వెళ్లిపోయిన కృష్ణంరాజు లాంటి పెద్దమనిషికి.. కనీసం రెండు రోజులైనా షూటింగ్‌ ఆపేద్దాం.. ఖర్చులు పెరిగిపోయి నెలల తరబడి షూటింగ్‌లు ఆపేసిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమది. అలాంటిది కళామతల్లి ముద్దుబిడ్డ, గొప్ప నటుడు అయిన కృష్ణంరాజు మృతి చెందితే కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపి సంతాపం ప్రకటించరా అని టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించారు రాంగోపాల్ వర్మ.

మరి ఆర్జీవీ మాటలను ఇండస్ట్రీ పెద్దలు సీరియస్‌గా తీసుకుంటారో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story