సినిమా

Ram Gopal Varma : మంత్రి పేర్ని నానితో భేటి కానున్న వర్మ

Ram Gopal Varma : ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడేందుకు రామ్‌ గోపాల్‌ వర్మ... మంత్రి పేర్నినానితో భేటీ కానున్నారు.

Ram Gopal Varma : మంత్రి పేర్ని నానితో భేటి కానున్న వర్మ
X

Ram Gopal Varma : ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడేందుకు రామ్‌ గోపాల్‌ వర్మ... మంత్రి పేర్నినానితో భేటీ కానున్నారు. ఈ నెల 10 వ తేదీన మధ్యాహ్నం సమావేశానికి రావాలని... మంత్రి నుంచి ఆహ్వానం అందినట్లు వర్మ ట్విట్టర్‌లో వెల్లడించారు. సినీరంగ సమస్యలపై అభిప్రాయాలను పంచుకునేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఆయన పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే ఈ అంశంపై ట్విట్టర్‌ వేదికగా వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి పేర్నినాని కూడా సమాధానమివ్వడం.. ఆ తర్వాత మళ్లీ వర్మ కౌంటర్‌ ఇవ్వడంతో... వ్యవహారం రసవత్తరంగా మారింది. చివరికి మంత్రి పేర్ని నాని రామూను చర్చలకు పిలవడంతో... ఈ ట్వీట్ల యుద్ధానికి తెరపడింది. ఇక ఇప్పుడు ముందుగా చెప్పినట్లుగానే... మంత్రి వర్మను సమావేశానికి ఆహ్వానించారు.


Next Story

RELATED STORIES