Rashmika Mandana: నా కోసం ఇద్దరు వెయిటింగ్: రష్మిక మందన

Rashmika Mandana: నా కోసం ఇద్దరు వెయిటింగ్: రష్మిక మందన
Rashmika Mandana: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఇంటికి వెళ్లగానే హ్యాపీగా రిలాక్స్ అయిపోతుంది..

Rashmika Mandana: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఇంటికి వెళ్లగానే హ్యాపీగా రిలాక్స్ అయిపోతుంది..తన కోసం ఇంట్లో ఎదురు చూస్తున్న ఇద్దరితో ఆడుకుంటానని చెప్పింది. తాజాగా పెట్టిన పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించింది.. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే ఇప్పటికే ఆమె పెంచుకుంటున్న పెట్ డాగ్ ఆరా ఒకటి అయితే, కొత్తగా వచ్చిన అతిధి స్నో అనే పిల్లి కూడా ఒకటి. ఈ సందర్భంగా స్నోతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది రష్మిక.

వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.. ఫాలోవర్ల కోసం క్యూట్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది.. తాను పెంచుకుంటున్న పెట్ సంగతులు పంచుకుంటుంది అభిమానులతో.. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్నో ఫోటో, వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. ఇది నా కొత్త పెట్ స్నో.. ఇంకో మూడేళ్లలో నా ఇల్లు చిన్నపాటి అడవిగా మారిపోతుందేమో అని రాసింది.

అలాగే తన పెట్స్ (కుక్క, పిల్ల) బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. వాళ్లిద్దరు నా కోసం ఎలా ఎదురు చూస్తున్నాయో చూశారా.. అని ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప 2, బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో యానిమల్, కోలీవుడ్‌లో విజయ్‌తో వరిసు చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story