సినిమా

Rashmika Mandana: పుష్ప ఎఫెక్ట్.. తెలుగు మూవీస్ రిజెక్ట్ చేస్తున్న శ్రీవల్లి

Rashmika Mandana: ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడం, గోవా టూర్ ఇవన్నీ వాళ్ల మధ్య ఫ్రెండ్‌షిప్ మరింత బలపడిందనేదానికి నిదర్శనాలు.

Rashmika Mandana: పుష్ప ఎఫెక్ట్.. తెలుగు మూవీస్ రిజెక్ట్ చేస్తున్న శ్రీవల్లి
X

Rashmika Mandana: స్టైలిష్ హీరో అల్లు అర్జున్‌తో నటించే ఛాన్స్ కొట్టేసి శ్రీవల్లిగా అదరగొట్టింది రష్మిక. గ్లామర్ బ్యూటీకి మేకప్ లేకపోయినా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. పుష్ప దిరైజ్ కేరళ, తమిళనాడులో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్ర విజయాన్ని రష్మిక ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది.

పుష్ప విజయం తన బాలీవుడ్ కలలను మరింత పెంచిందని రష్మిక భావిస్తోంది. తన రాబోయే హిందీ చిత్రాలు గుడ్‌బై, మిషన్ మజ్ను తన బాలీవుడ్ కెరీర్‌కు మరింత ఊపునిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమా ఆఫర్లను కూడా తిరస్కరించినట్లు వినిపిస్తోంది.

స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించింది. తన దృష్టి అంతా ఇప్పుడు బాలీవుడ్‌పైనే ఉంది. పాన్ ఇండియా సినిమా అయినా నో చెప్పేస్తోంది.. బాలీవుడ్‌కే నా ఓటు అంటోంది.. కాగా, రష్మిక, విజయ్‌ల మధ్య ఏదో నడుస్తోంది అనేందుకు ఊతమిచ్చేలా వాళ్లిద్దరూ ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడం, గోవా టూర్ ఇవన్నీ వాళ్ల మధ్య ఫ్రెండ్‌షిప్ మరింత బలపడిందనేదానికి నిదర్శనాలు.. అయితే ఈ సంవత్సరం వీరిద్దరి నుంచి ఏదో గుడ్‌న్యూస్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు విజయ్, రష్మిక అభిమానులు.

Next Story

RELATED STORIES