రష్మిక హీరోను చూసి సినిమా ఒప్పుకుంటుందా..?

రష్మిక హీరోను చూసి సినిమా ఒప్పుకుంటుందా..?

కుర్రాళ్ల డ్రీమ్ గాళ్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తన కామెంట్స్ తో అప్పుడప్పుడూ ట్రెండింగ్ లోకి రావడం ఈమెకు అలవాటే. రీసెంట్ గా యానిమల్ లో ఓవర్ డోస్ సీన్లలో నటించి క్రేజ్ ను విపరీతంగా పెంచుకుంది రష్మిక.

ప్రస్తుతం రష్మిక తన నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది. రష్మిక గురించి సోషల్ మీడియాలో ఓ పుకారు షికారు చేస్తోంది. డైరెక్టర్, హీరో కోసమే “ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమా చేశానంటూ ఓ ఇంటర్వ్యూలో రష్మిక చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. రష్మిక ఇలా కూడా చేస్తుందా అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ కామెంట్ చేసిన ఓ నెటిజన్ పై రష్మిక స్పందించింది.

రష్మిక పుష్ప-2, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల కోసం ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఐతే.. తాను కథలు నమ్మే సినిమాలు చేస్తానని రష్మిక క్లారిటీ ఇచ్చింది. అలా డైరెక్టర్, హీరోను చూసి సినిమా చేస్తానని మీకెవరు చెప్పారు అని ఎదురు ప్రశ్నించింది. కొన్ని సినిమాల్లో అరుదైన యాక్టర్లతో సినిమా చేయడం ఒక గౌరవం లాంటిదనీ.. పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో తెలియడం లేదని తెలిపింది. తన రెమ్యునరేషన్ పెంచేశానంటూ వచ్చిన వార్తలను కూడా రష్మిక ట్రాష్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story