Dhamaka: శ్రీలీలతో లిప్ లాక్ సీన్లు.. నో చెప్పిన రవితేజ.. కారణం..

Dhamaka: శ్రీలీలతో లిప్ లాక్ సీన్లు.. నో చెప్పిన రవితేజ.. కారణం..
Dhamaka: మాస్ మహారాజా రవితేజ నటించిన 'ధమాకా' చిత్రం ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి త్రినాథరావు దర్శకత్వం వహించారు.

Dhamaka: మాస్ మహారాజా రవితేజ నటించిన 'ధమాకా' చిత్రం ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి త్రినాథరావు దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


54 ఏళ్ల స్టార్ హీరో రవితేజ ఈ మధ్య తాను నటించిన ప్రతి సినిమాలో హీరోయిన్లను ముద్దుపెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ, దివ్యాంశ కౌశిక్‌లతో లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. అయితే ఈసారి రవితేజ శ్రీలీల ముద్దుకు నో చెప్పాడు.


ధమాకాలో యువ నటి శ్రీలీలతో కలిసి రవితేజ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. మాస్ మహారాజా, శ్రీలీల మధ్య లిప్ లాక్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఈసారి అలా జరగకుండా జాగ్రత్తపడ్డాడు రవితేజ.


రెండు కారణాల వల్ల రవితేజ కిస్సింగ్ సీన్స్‌కి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఒకటి హీరో హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం, రెండవ కారణం అతను ముద్దు సన్నివేశాలు చేసిన మునుపటి చిత్రాలన్నీ వాణిజ్యపరంగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.


కాగా, ధమాకా చిత్ర క‌థ‌ని ప్రసన్న కుమార్ బెజ‌వాడ రాశారు. చిత్రంలో రావు రమేష్, చిరాగ్ జాని, జయరామ్, తనికెళ్ల భరణి వంటి ప్రముఖ తారాగాణం నటించారు.

Tags

Read MoreRead Less
Next Story