సినిమా

Rajasekhar 'Ankusam': అంకుశంలో రామిరెడ్డిని నిజంగానే కొట్టా: రాజశేఖర్

Rajasekhar 'Ankusam': గురువుని రక్షించడం కోసం తన ప్రాణాలకు తెగించి పోరాడిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ నటన హైలెట్.

Rajasekhar Ankusam: అంకుశంలో రామిరెడ్డిని నిజంగానే కొట్టా: రాజశేఖర్
X

Rajasekhar 'Ankusam': కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అంకుశం' చిత్రం పోలీస్ పవర్ ఏంటో చూపిస్తుంది. ఆ చిత్రంలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఇమిడిపోయి చక్కగా నటించాడు.. ఇక విలన్‌గా రామిరెడ్డి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.. నిజానికి మృదు స్వభావి అయిన రామిరెడ్డిని తెరపై విలన్‌గా చూపించిన ఘనత కోడిరామకృష్ణది.

నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ భార్యగా జీవిత నటించింది. గురువుని రక్షించడం కోసం తన ప్రాణాలకు తెగించి పోరాడిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ నటన హైలెట్.. ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో రాజశేఖర్ తదుపరి చిత్రాలు ఆయన ఇమేజ్‌ని మరింత పెంచేవిగా వచ్చాయి.

ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న రాజశేఖర్.. విలన్ రామిరెడ్డిని కొట్టుకుంటూ రావలసిన సన్నివేశం ఒకటి ఉంటుంది. షూటింగ్‌లో తాను కొట్టినట్టు నటిస్తున్నా ఆయన కదల్లేదట.. చూసేవాళ్లు ఏమనుకుంటారో అని దెబ్బతగలనట్టుగానే ఉన్నారట.. దీంతో దర్శకుడు కోడి రామకృష్ణ వచ్చి నిజంగానే రామిరెడ్డిని కొట్టమని చెప్పారట..

కొడితే కానీ నటించరేమో అనుకొని నిజంగానే కొట్టేశారట రాజశేఖర్.. అప్పుడు గానీ విలన్ పాత్ర పోషిస్తున్న రామిరెడ్డి కదల్లేదట. అయితే ఆ సీన్ చేయడం రామిరెడ్డికి అస్సలు ఇష్టం లేదు.. కానీ చిత్రంలో ఆ సీనే హైలెట్ అయింది. అంకుశం సూపర్ డూపర్ హిట్టైంది అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

కొన్ని చిత్రాల్లో ఏదైతే వద్దనుకుంటారో అవే హైలెట్‌గా నిలుస్తుంటాయి.. సినిమాని నిలబెడతాయి. అంకుశం వచ్చి 30 ఏళ్లయినా ఆ చిత్రం గురించి ముఖ్యంగా ఆ సన్నివేశం గురించి మాట్లాడుకునేలా చేసింది.

Next Story

RELATED STORIES