సినిమా

Republic Movie Twitter Review: సాయి ధరమ్ తేజ్, రమ్యకృష్ణ నటన హైలెట్.. 'రిపబ్లిక్' ట్విట్టర్ రివ్యూ..

Republic Movie Twitter:దేవా కట్టా డైరెక్షన్లో వచ్చిన చిత్రం రిపబ్లిక్.. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఈ రోజు థియేటర్లలో సందడి చేస్తోంది.

Republic Movie Twitter Review: సాయి ధరమ్ తేజ్, రమ్యకృష్ణ నటన హైలెట్.. రిపబ్లిక్ ట్విట్టర్ రివ్యూ..
X

Republic Movie Twitter Review: దేవా కట్టా డైరెక్షన్లో వచ్చిన చిత్రం రిపబ్లిక్.. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఈ రోజు థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు, టీజర్, ట్రైలర్ వంటి వాటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఇంకా డిశ్చార్జ్ కాలేదు.

అయినా ఆయన కోరిక మేరకు అక్టోబర్ 1న చిత్రాన్ని రిలీజ్ చేసింది యూనిట్. ముందుగా మూవీ చూసిన సెలబ్రెటీలు సాయి నటనను మెచ్చుకున్నారు. నెటిజన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సాయి తన కెరీర్‌లోనే ది బెస్ట్ ఫెర్‌ఫామెన్స్ ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుత సమాజంలోని అంశాలనే ఎంతో హృద్యంగా తెరకెక్కించారు అని దర్శకుడిని కొనియాడుతున్నారు. సిస్టంలోని లొసుగులను ఎత్తిచూపారు అని ఓ నెటిజన్ సినిమా గురించి చెప్పుకొచ్చారు. విశాఖ వాణిగా రమ్యకృష్ణ తన నటనతో అదగొట్టిందని, సినిమా హిట్ అని మరికొంత మంది తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.Next Story

RELATED STORIES