సినిమా

RGV: ఏమన్నాడో.. వర్మ చెంప చెళ్లుమనిపించిన అషురెడ్డి..

వర్మ లీలలు చూడతరమా.. సామాజిక మాధ్యమాల్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు..

RGV: ఏమన్నాడో.. వర్మ చెంప చెళ్లుమనిపించిన అషురెడ్డి..
X

RGV: వర్మ లీలలు చూడతరమా.. సామాజిక మాధ్యమాల్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.. ప్రతి రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండాలి. బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి సినిమాలే తియ్యాలా ఏంటి. అంతకంటే ఎక్కువ పబ్లిసిటీ ఈజీగా పైసా ఖర్చు లేకుండా వచ్చేస్తుంటే.. కరెక్ట్‌గా వ్యూయర్స్ వీక్‌నెస్‌ని పట్టుకుని ఏదో ఒక పాయింట్ హైలెట్ అయ్యేలా ప్లాన్ చేసి వీడియో వదులుతాడు.. వర్మ అభిమానులతో పాటు విమర్శకులకూ కాలక్షేపం.

తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ అషు‌రెడ్డిని ఏమన్నారో.. ఆవిడ ఆయన చెంప చెళ్లుమనిపించింది. ముందే ప్లాన్ చేసినట్లు అస్సలు అనిపించకుండా జాగ్రత్తపడ్డారు. ఈ మధ్య ఓ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన వర్మ అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు కూడా అదే తరహాలో అషురెడ్డితో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఓ కెఫేలో కాఫీ తాగుతున్న అషురెడ్డి దగ్గరకు వర్మ వెళ్లారు.

అషురెడ్డిని పరిచయం చేసుకుని పులిహోర కలపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన అన్న మాటలకు కోపం వచ్చిన అషు.. వర్మ చెంప పగలగొట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే సెప్టెంబర్ 7 వరకు ఆగాల్సిందే అంటున్నారు నిర్వాహకులు. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.

Next Story

RELATED STORIES