RGV: ఆ సినిమా చూస్తే వాళ్లకి పీడకలలే.. : వర్మ కామెంట్

RGV: ఆ సినిమా చూస్తే వాళ్లకి పీడకలలే.. : వర్మ కామెంట్
RGV: నటీనటుల పారితోషికానికి కాదు ఎక్కువ ఖర్చు చేయాల్సింది.. ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందనడానికి నిదర్శనం ఈ చిత్రం

RGV: ఆర్జీవీకి ఆ సినిమా బాగా నచ్చినట్లుంది.. అందుకే ఆ సినిమా గురించి ప్రతి రోజు కామెంట్లు పెడుతున్నారు.. ఎవరేమనుకున్నా నాకేంటి అని ఏకిపారేసే ఆర్జీవీ శాండల్ వుడ్ మీద ప్రేమ కురిపిస్తున్నారు.. కేజీఎఫ్ తో శాండల్ వుడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంలో మేమే తోపు అనుకునే బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా కేజీఎఫ్ 2 చూస్తే పీడకలలు రావడం గ్యారెంటీ అంటున్నారు ఆర్జీవీ. సినిమా విజయం వారికి పీడకలలు తెప్పిస్తుందని వర్మ కామెంట్ చేశారు.

నటీనటుల పారితోషికానికి కాదు ఎక్కువ ఖర్చు చేయాల్సింది.. ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందనడానికి నిదర్శనం ఈ చిత్రం అని అంటున్నారు. కేజీఎఫ్ ముందు వరకు కన్నడ చిత్ర పరిశ్రమను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.. కానీ ప్రశాంత్ నీల్ కన్నడ చిత్ర పరిశ్రమను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాడు.

విలన్స్ తో పోరాడేందుకు రాఖీబాయ్ మిషన్ గన్స్ తో ముంబయిలో ఎలా అడుగు పెట్టాడో.. అదే మాదిరిగా ఓపెనింగ్ కలెక్షన్స్ తో బాలీవుడ్ స్టార్స్ అందరిపై యశ్ యుద్ధం చేశాడు. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ తో బాలీవుడ్ పై శాండల్ వుడ్ బాంబ్ విసరనుంది.

ఈ సినిమా ఓ గ్యాంగ్ స్టర్ చిత్రమే కాదు.. బాలీవుడ్ వాళ్లకి అదొక హారర్ మూవీ. ఈ సినిమా సక్సెస్ వాళ్లకి పీడకలలు వచ్చేలా చేస్తుంది అని వర్మ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. వర్మ కామెంట్లకు నెటిజన్లు కూడా మద్దతు పలుకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేజీఎఫ్ భారీ విజయాన్ని సాధించింది..

Tags

Read MoreRead Less
Next Story