సాయి పల్లవి అమర్‌నాథ్ యాత్ర.. "జీవితమే ఒక తీర్థయాత్ర" అంటూ..

సాయి పల్లవి అమర్‌నాథ్ యాత్ర..  జీవితమే ఒక తీర్థయాత్ర అంటూ..
"ఈ ప్రదేశం శక్తివంతమైనది ఎందుకంటే ఇది నిస్వార్థ సేవా చర్యలకు సాక్షిగా నిలుస్తుంది" అని సాయి పల్లవి రాశారు.

"ఈ ప్రదేశం శక్తివంతమైనది ఎందుకంటే ఇది నిస్వార్థ సేవా చర్యలకు సాక్షిగా నిలుస్తుంది" అని సాయి పల్లవి రాశారు. సాయి పల్లవి సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. చాలా రేర్ గా తన స్వ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. కానీ ఆమె ,ేసిన అనుకున్న అమర్‌నాథ్ యాత్ర విశేషాల గురించి తన అంతర్గత ఆలోచనలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె తన తల్లిదండ్రులను కూడా ఈ యాత్రకు తీసుకు వెళ్లింది.

యాత్ర విశేషాలను పంచుకుంటూ.. నేను నా వ్యక్తిగత ఆలోచనలను పంచుకోవడాన్ని ఎప్పుడూ ఇష్టపడను. కానీ నేను చాలా కాలంగా చేయాలనుకుంటున్న ఈ తీర్థయాత్ర గురించి వ్రాయాలనుకుంటున్నాను. దాదాపు 60 ఏళ్ల వయసున్న నా తల్లిదండ్రులను తీసుకొని యాత్రకు బయల్దేరాను. ఎత్తుకు వెళ్లిన కొద్దీ ఆక్సిజన్ అందక అమ్మానాన్న ఊపిరి పీల్చుకోవడం, వారి ఛాతీని పట్టుకోవడం, మంచు మధ్య జారే మార్గాల్లో విరామం తీసుకోవడం చూసి.. సర్వ శక్తిమంతుడైన ఆ దేవుడిని ప్రశ్నించేలా చేసింది, మీరు ఇంత దూరంలో ఎందుకు ఉన్నారు అని"

కానీ దర్శనం తర్వాత నా ప్రశ్నకు సమాధానం లభించిందని సాయి పల్లవి పేర్కొంది. నేను కొండపైకి నడిచినప్పుడు, అద్భుతాన్ని చూశాను. కొంతమంది యాత్రికులను గమనించినప్పుడు, వారు దీర్ఘ శ్వాస తీసుకొని "ఓం నమః శివాయ" అని జపిస్తారు. యాత్ర సవ్యంగా కొనసాగడానికి తమను తాము సమాయత్త పరుచుకుంటారు. పవిత్ర గుహలో ఉన్న భోలే నాథ్‌ను దర్శించాలన్న భక్తుల కోరికను నెరవేర్చడానికి గుర్రాలు, బగ్గీల ద్వారా గ్రామస్థులు యాత్రికులను తీసుకువెళతారు."

తన యాత్రను పరిపూర్ణంగా మార్చిన వ్యక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ, సాయి పల్లవి ఇలా వ్రాసింది, "ఈ యాత్రను మనలాంటి లక్షలాది మంది భక్తులకు చిరస్మరణీయం చేసిన శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డులోని ప్రతి ఒక్కరికీ నా ప్రణామాలు! చివరకు ఆర్మీ/సిఆర్‌పిఎఫ్/పోలీసుల సిబ్బంది తమ నిస్వార్థ సేవలను గురించి ఎంత చెప్పినా తక్కువే. మనల్ని ఎల్లవేళలా రక్షించడం తమ కర్తవ్యంగా భావిస్తారు. ఒక విధంగా వారు మనకు సేవ చేస్తున్నట్లు అనిపిస్తుంది.

"ఈ ప్రదేశం అత్యంత శక్తివంతమైనది. మన సంపద, అందం, శక్తితో సంబంధం లేకుండా ఉంటుంది ఈ ప్రయాణం. ఇతరులకు సహాయపడే హృదయం ఎల్లవేళలా మనల్ని సజీవంగా ఉంచుతుంది. అమర్‌నాథ్ యాత్ర నా సంకల్ప శక్తిని సవాలు చేసింది, నా శరీరాన్ని పరీక్షించింది. ఈ జీవితమే ఒక తీర్థయాత్ర అని నిరూపించింది. మనం ఒకరికొకరు సహాయం చేసుకోకుంటే మనం మరణించిన వారితో సమానం అని నిరూపించింది!" నటి అమృతా సుభాష్ సాయి పల్లవి పోస్ట్‌పై కొన్ని రెడ్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది. నటి రాశి ఖన్నా కూడా ఎమోజీలను పోస్ట్ చేసింది.

సాయి పల్లవి ప్రేమమ్ , కలి , ఫిదా , శ్యామ్ సింగరాయ్ వంటి కొన్ని సినిమాలతో పాపులర్ అయ్యింది. తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్ కి, ఎక్స్ పోజింగ్ దూరంగా ఉండే సాయిపల్లవి కథలో తన పాత్రకు ప్రాముఖ్యం ఉంటేనే నటిస్తుంది. అందుకే ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమాన నటి అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story