సినిమా

Sai Pallavi: నాగార్జున గత జన్మలో..: సాయిపల్లవి

రీసెంట్‌గా 'లవ్ స్టోరీ' మూవీ తో తెలుగు ప్రేక్షకులని మరోసారి పలకరించిన సాయి పల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Sai Pallavi: నాగార్జున గత జన్మలో..: సాయిపల్లవి
X

సాయి పల్లవి చేసింది కొన్ని సినిమాలే అయిన ఈ కేరళ పిల్ల తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన డాన్స్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. రీసెంట్‌గా 'లవ్ స్టోరీ' మూవీ తో తెలుగు ప్రేక్షకులని మరోసారి పలకరించిన సాయి పల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం సక్సెస్ మీట్‌కు వచ్చిన నాగార్జున సాయిపల్లవి నటనకు ఫిదా అయ్యాడు.

ముఖ్యంగా సాయిపల్లవి డ్యాన్స్ గురించి నాగ్ ఓ రేంజ్‌లో ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే ఒక ఆరా కనిపిస్తుందని.. వంద మంది సాయిపల్లవిలు డ్యాన్స్ చేస్తున్నట్లుంటుందని.. తను నేల మీద ఉన్నా కూడా గాల్లో తేలుతున్న భావన కలిగిస్తుందని నాగ్ తన మనసులో మాట బయటపెట్టేశాడు.




ఇదిలా ఉంటే సాయి పల్లవి కూడా నాగ్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు చెప్పుకొచ్చింది. తన తాతయ్యకు 'అన్నమయ్య' సినిమా అంటే అమితమైన ఇష్టమని.. ఆ చిత్రాన్ని ఆయన వందసార్లు చూశారని చెప్పుకొచ్చింది. సినిమా చూసిన ప్రతిసారీ తనకి, తన చెల్లెలికి కూడా ఆ చిత్రం చూపించే వారని చెప్పింది. ఆ సినిమా పతాక సన్నివేశంలో అన్నమయ్య వేంకటేశ్వరుడి సన్నిధిలోకి చేరే సన్నివేశాన్ని చూసి.. అది సినిమా అన్న విషయం మర్చిపోయి కన్నీళ్లు పెట్టుకునేవారని చెప్పింది.

ఐతే అదంతా నటన తాతయ్యా అని ఎన్ని సార్లు చెప్పినా వినేవారు కాదు. అంతే ఆసక్తితో ఉండేవారు ఎప్పుడు చూసినా అని చెప్పుకొచ్చింది. అయితే తాతయ్య మాత్రం గత జన్మలో నాగ్ ఓ సన్యాసి అయి ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయడం అసాధ్యం అనేవారు. ఒక నటుడికి తన పాత్ర పై ఎంతో మక్కువ ఉంటేగాని నటించడం కష్టం అని నాగ్ సార్ నుండి ఈ పాఠం నేర్చుకున్నానని ఆమె చెప్పుకోచ్చింది. తన తాతయ్య దృష్టిలో నాగార్జున ఓ అన్నమయ్య. ఆయన దృష్టిలో నాగ్ స్థానం ఎప్పటికీ మారకూడదు. అందుకే టీవీలో నాగార్జున సినిమా ఇంకేది వచ్చినా ఛానల్ మార్చేస్తానని చెప్పింది. నాగార్జునపై తాతయ్యకు ఉన్నఅభిమానాన్ని అందరితో పంచుకుంది.

Next Story

RELATED STORIES