Salman Khan: కండల వీరుడికి అంతుచిక్కని వ్యాధి

Salman Khan: కండల వీరుడికి అంతుచిక్కని వ్యాధి
Salman Khan: అయితే సల్మాన్ ఈ వ్యాధిని అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట.

Salman Khan: బాలీవుడ్ హీరో.. సల్మాన్ ఖాన్ అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని వెల్లడించారు. ఫేషియల్ నర్వ్ డిజార్డర్, ట్రిజెమినల్ న్యూరాల్జియా. ఈ వ్యాధి ఉన్న వారికి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు తీవ్రంగా ఉంటాయట. అయితే సల్మాన్ ఈ వ్యాధిని అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట. తాను నటించిన ట్యూబ్ లైట్ చిత్రంలోని మొదటి పాటను దుబాయ్ లో లాంచ్ చేస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. తనను వేధిస్తున్న నరాల రుగ్మత గురించి వివరించాడు.

తన ఈ బాధను అధిగమించేందుకు పనిపైన ఎక్కువ దృష్టి పెడుతుంటానని చెప్పాడు. అయితే తనకి కూడా ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయని అన్నాడు. కానీ వెంటనే నేను పని చేయాల్సిన అవసరం ఉందని గ్రహించుకుంటాను. ఈ వ్యాధిని భరించడం నిజంగా కష్టం అని అన్నాడు.

సల్మాన్ తన వైద్య పరిస్థితి గురించి 2001లో మొదటిసారిగా వెల్లడించాడు, "నా గొంతులో బొంగురు ఉంది, అది నేను తాగినందువల్ల కాదు, రంజాన్ సమయంలో అయితే నేను అస్సలు తాగను, ఈ అనారోగ్యం కారణంగానే నేను ఇంకా బాగా చేయాలని అనుకుంటాను. ఇక ఇప్పుడు నాకు శక్తి కొంత సన్నగిల్లుతోంది. దాంతో నా ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టడం తప్ప నాకు వేరే మార్గం లేదు. " అని సల్మాన్ వివరించాడు.

Tags

Read MoreRead Less
Next Story