సినిమా

Samantha: వర్కవుట్స్‌తోనే మీ డే స్టార్ట్ అవ్వాలి.. అప్పుడే మీరు..

Samantha: తాజాగా తన వర్కవుట్స్‌కి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Samantha: వర్కవుట్స్‌తోనే మీ డే స్టార్ట్ అవ్వాలి.. అప్పుడే మీరు..
X

Samantha: మనసు బావుంటే మనుషులు బావుంటారు నిజమే.. కానీ ఒక్కోసారి ఆ మనసుకు గాయమైతే కోలుకునే శక్తి కావాలి. అందుకు ఆరోగ్యంగా ఉండాలి తప్పదు.. ఎవరూ మనల్ని ప్రతి రోజూ ఓదార్చరు.. మనతో పాటు ఉండరు. అందుకే స్ట్రాంగ్‌గా ఉండాలి..

మీకు నచ్చిన ఏదో ఒక వ్యాయామం చేస్తూ, మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి.. మంచి ఆలోచనలు చేయండి.. మీరు చేస్తున్న పనికి మీ బెస్ట్ ఇవ్వండి అని అభిమానుల్ని ఎప్పుడూ తన మాటలతో ఎంకరేజ్ చేస్తుంటుంది సమంత.. తాజాగా తన వర్కవుట్స్‌కి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్న సమంత తన లేటెస్ట్ మూవీ యశోద కోసం తనని తాను సిద్ధం చేసుకుంటోంది. హరి శంకర్, హరీష్ నారాయణ్ సహ దర్శకులుగా వ్యవహరిస్తున్న ఈ ద్విభాషా చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.సమంత నటించిన తమిళ చిత్రం కాతు వాకుల రెండు కాదల్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార, విఘ్నేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తు్న్న ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. బాలీవుడ్‌లోనే ఆఫర్లు అందిపుచ్చుకుంటున్న సమంత తన డేని ఎప్పుడూ బిజీగా ఉంచుకుంటుంది.

Next Story

RELATED STORIES