Samantha: టైగర్ ష్రాఫ్‌ ఛాలెంజ్ ని స్వీకరించిన సమంత.. వీడియో వైరల్

Samantha: టైగర్ ష్రాఫ్‌ ఛాలెంజ్ ని స్వీకరించిన సమంత.. వీడియో వైరల్
Samantha: అందాల భామ సమంతకు వర్కవుట్స్ చేయడం చాలా ఇష్టం..

Samantha:అందాల భామ సమంతకు వర్కవుట్స్ చేయడం చాలా ఇష్టం.. తాను చేస్తున్న వ్యాయామాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.

తాజాగా తన వర్కౌట్ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీనిలో ఆమె భారీ పరికరాలతో వ్యాయామం చేస్తోంది. ఈ విషయాన్ని పంచుకోవడంతో పాటు, టైగర్ ష్రాఫ్‌కి సమంత ధన్యవాదాలు తెలిపింది.

ఎందుకంటే నటుడు తనకు 'ఎటాక్ ఛాలెంజ్' ఇచ్చాడు. దానితో ఆమె అధిక బరువు ఉన్న పరికరాలతో వర్కౌట్‌లు చేయాల్సి వచ్చింది. ఆమె ష్రాప్ తన కు ఇచ్చిన సవాలును పూర్తి చేసి నటుడు అర్జున్ కపూర్‌ని నామినేట్ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో తన వర్కౌట్ వీడియోను పంచుకోవడంతో పాటు, సమంత అద్భుతమైన క్యాప్షన్ కూడా రాసింది, 'నాకు ఈ ఛాలెంజ్ ఇచ్చినందుకు టైగర్ ష్రాఫ్‌కు ధన్యవాదాలు. నేను మరొకరికి ఈ ఛాలెంజ్ ఇస్తాను అని తెలిపింది.

ఈ ఛాలెంజ్ ఎలా మొదలైంది?

నటి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న 'ఎటాక్' చిత్రం ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం రకుల్ ఈ ఛాలెంజ్ ని స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో రకుల్, జాన్ అబ్రహంతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.. ఇందులో ఆయన సూపర్ సోల్జర్ పాత్రలో కనిపించనుంది. ఇందులో మరోనటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తోంది.

కాగా, సమంత ప్రస్తుతం 'యశోద' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది విడుదలచేసే యోచనలో ఉన్నారు మేకర్స్. ఇదివరకే పూర్తి చేసిన మరో ప్రాజెక్ట్ 'శాకుంతలం'లో కూడా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇప్పటికే విడుదలై చిత్రంపై అంచనాలు పెంచింది.

Tags

Read MoreRead Less
Next Story