Samantha: ఆ విషయం గురించి 65 వేల ట్వీట్లు.. మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా: సమంత

Samantha: ఆ విషయం గురించి 65 వేల ట్వీట్లు.. మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా: సమంత
సమంత.. ఓ గ్లామర్ డాలే కాదు.. అందం, అభినయం, మంచితనం కలగలిపిన ఓ అద్భుతమైన నటి. ఆమె ఎంచుకునే పాత్రలు, నటించే తీరు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది.

Samantha: సమంత.. ఓ గ్లామర్ డాలే కాదు.. అందం, అభినయం, మంచితనం కలగలిపిన ఓ అద్భుతమైన నటి. ఆమె ఎంచుకునే పాత్రలు, నటించే తీరు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. పాత్రల ఎంపికలో పరిణతి కనబరిచే సమంత ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా, ధ్యానం వంటివి చేస్తూనే జిమ్‌లో శరీరానికి అలసట కలిగించే వ్యాయామాలూ చేస్తుంది.

తాజాగా తాను నటించిన మొదటి వెబ్‌ సిరీస్ ( ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2)కి మంచి పేరు రావడంతో పాటు అవార్డు అందుకోవడం సంతోషాన్నిచ్చిందని చెబుతోంది. రాజీ పాత్రకు తనను ఎంపిక చేసుకున్నందుకు దర్శకుడు రాజ్ అండ్ డి.కె.కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నా పాత్రలకి నేనే విమర్శకురాలిని.

ఎప్పుడూ నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటా. అందుకే రాజీ పాత్రకు పూర్తి న్యాయం చేయాలని ప్రయత్నించా. ఆ ప్రయత్నం ఫలించినందుకు సంతోషంగా ఉంది అని అంటోంది. డిస్నీ సినిమాలు చూస్తూ పెరిగాను. వాటిల్లో రాజకుమారుడు, రాజకుమారి పాత్రలు నన్నెంతో ఆకర్షించాయి. వాటిని అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటా. ఈ కారణంగానే ఇతిహాస చిత్రాల్లో నటించాలనే కోరిక కలిగింది. దర్శకుడు గుణ శేఖర్ వల్ల ఆ కల నిజమైంది. శాకుంతలంలో నటించే అవకాశం వచ్చింది. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా ఆ కథ రూపొందుతోంది అని చెప్పారు.

యాక్షన్ సన్నివేశాల్లో నటించాలని ఉంది. రాజీ పాత్ర కోసం కొన్ని పోరాటాలు చేశాను. విలన్లు బంధిస్తే ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించండి అనే పాత్ర కాకుండా నన్ను నేనే రక్షించుకోవడం మంచి అనుభూతిని ఇచ్చింది. సూపర్ మ్యాన్‌గా నటించాలని ఉంది. భవిష్యత్తులో అది కూడా చేస్తానేమో తెలియదు అని అన్నారు.

సామాజిక మాధ్యమాల్లో పేరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నారు. అదో పెద్ద హాట్ టాపిక్ అయింది. ట్రోల్స్ చేస్తున్నారు. దానిపై స్పందించాలని అనుకోవట్లేదు. ఈ విషయంపై 65,000 ట్వీట్లు వచ్చాయి. కానీ, నాకు జవాబివ్వాలని లేదు. ఆ విషయాలపై నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా అని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story