Samantha Conditions : విడాకుల తర్వాత 'సామ్' కొత్త రూల్స్.. నయన్‌లా కండీషన్స్..

Samantha Conditions : విడాకుల తర్వాత సామ్ కొత్త రూల్స్.. నయన్‌లా కండీషన్స్..
Samantha Conditions : జీవితంలో జరిగే కొన్ని విషయాలను జీర్ణించుకోవడం చాలా కష్టం.. కానీ అవే ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేం. ఇప్పుడు అదే చేస్తోంది సమంత.

జీవితంలో జరిగే కొన్ని విషయాలను జీర్ణించుకోవడం చాలా కష్టం.. కానీ అవే ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేం. ఇప్పుడు అదే చేస్తోంది సమంత. నాగచైతన్యతో విడిపోయిన తరువాత సినిమాలకు ఏ మాత్రం బ్రేక్ చెప్పకుండా వరుస ఆఫర్లతో బిజీగా మారింది.

అయితే మునుపటి మాదిరిగా కాకుండా కొన్ని కండిషన్స్ పెడుతోంది తనతో సినిమా తీయాలనుకుంటున్న దర్శక నిర్మాతలకు.. సామ్ చెబుతున్న కండిషన్స్ మరీ ఇబ్బందికరంగా లేకపోవడంతో ఓకే అంటున్నారు దర్శకులు కూడా. నయన తార కూడా దర్శక నిర్మాతలకు ఇలాంటి కండీషన్సే పెట్టి సినిమాల్లో నటిస్తోంది.

సామ్.. తాను నటించే సినిమా షూటింగ్స్ కేవలం చెన్నై పరిసర ప్రాంతాల్లోనే ఉండాలనేది ఆమె కండీషన్.. ఒకవేళ హైదరాబాద్‌లో అయితే ఇండోర్‌లో మాత్రమే ఉండాలని కోరుతోందట. పబ్లిక్‌లో షూటింగ్‌ని ఏమాత్రం ఇష్టపడడం లేదట సామ్.

ఇదిలా ఉంటే శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించబోతున్న ఓ చిత్రంలో సమంత నటించనున్నట్లు సమాచారం. అలాగే తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో నటించేందుకు సమంతకు అవకాశం వచ్చింది. ఈ చిత్రం కోసం సామ్ రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హరీ, హరీశ్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుంది. కాగా నయన్ మాదిరే ఇండోర్ షూటింగ్స్‌కే మొగ్గు చూపుతున్న సమంత, సినిమా ప్రమోషన్స్‌కి, ఈవెంట్స్‌కి కూడా ఆమె మాదిరే దూరంగా ఉంటుందేమో అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story