samantha post: ఈ ప్రపంచాన్ని మార్చాలంటే.. ముందు నన్ను నేను మార్చుకోవాలి: సమంత ట్వీట్ వైరల్

samantha post:  ఈ ప్రపంచాన్ని మార్చాలంటే.. ముందు నన్ను నేను మార్చుకోవాలి: సమంత ట్వీట్ వైరల్
samantha post: మోస్ట్ లవబుల్ కపుల్ విడిపోవడం అభిమానులను కలచి వేస్తోంది. ముచ్చటైన జంటలో చిచ్చుపెట్టిన అంశం ఏంటో తెలియక పోయినా అనేక ఊహాగానాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

samantha post: మోస్ట్ లవబుల్ కపుల్ విడిపోవడం అభిమానులను కలచి వేస్తోంది. ముచ్చటైన జంటలో చిచ్చుపెట్టిన అంశం ఏంటో తెలియక పోయినా అనేక ఊహాగానాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఈ మధ్య కాస్త సైలెంట్ అవడం.. విలేకరి మీద విరుచుకు పడడం.. సమంతకు ఏమైందో అని అభిమానులు కలవరపడ్డారు. అనుకున్నంతా అయింది.. కలకాలం కలిసి కాపురం చేస్తామని పెళ్లి నాడు ప్రమాణం చేసుకున్నారు.

పెళ్లైన మూడేళ్లకే తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు. చివరి మజిలీకి చేరుకోకుండానే మధ్యలోనే విడిపోయి ఎవరి దారులు వారు చూసుకున్నారు. అక్టోబర్ 2న వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన అనంతరం తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత స్పందించింది. ఫ్లయిట్ విండో నుంచి ఓ వీడియో షేర్ చేస్తూ..

'ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం పూర్తి చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు. బద్ధకం వదిలి ముందుకు నడవాలి'.. అని ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది.

దీన్నిబట్టి సమంతకు కొన్ని సొంత అభిప్రాయాలు, లక్ష్యాలు ఉండి ఉంటాయి.. అందుకోసం వివాహ బంధం అనే చట్రంలో ఇమిడి పోకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ, స్వతంత్రంగా ఎదగాలనుకుంటుందేమో.. కానీ వివాహం అయిన తరువాత కొన్ని పరిమితులు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగలేకపోయి ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.





Tags

Read MoreRead Less
Next Story