సినిమా

Samantha: రూ..25 లక్షలు గెలుచుకున్న సమంత.. కాళ్లకు దండం పెట్టొద్దన్న ఎన్టీఆర్..

Samantha: అమ్మ చెప్పిన మాటలు నిజమే అని నమ్ముతున్నా అంది.

Samantha: రూ..25 లక్షలు గెలుచుకున్న సమంత.. కాళ్లకు దండం పెట్టొద్దన్న ఎన్టీఆర్..
X

Samantha: ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులుకి అప్పుడప్పుడు సెలబ్రెటీలో వచ్చి షోలో సందడి చేస్తుంటారు. వారు గెలుచుకున్న ప్రైజ్ మనీని స్వచ్ఛంద సంస్ధలకు విరాళంగా ఇస్తుంటారు.

తాజాగా సమంత ఈషోలో పార్టిసిపేట్ చేసింది. షోలో భాగంగా ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నకు సమంత సమాధానం చెప్పలేకపోయింది. దాంతో 50:50 ఆప్షన్‌‌కు వెళ్లింది. పారిస్ అని ఆన్సర్ కరెక్ట్‌గా చెప్పినా ఎన్టీఆర్.. సమంతను కొద్ది సేపు ఆటపట్టించాలని టెన్షన్ పెట్టారు.

పారిస్ వెళ్తే షాపింగ్ చేయడం, ఐఫిల్ టవర్ చూడ్డం, బ్యాగులు కొనుక్కొని వచ్చేయడం అంతేనా అనేసరికి సమంత నవ్వేసింది. తను చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది.

ఇక రూ.25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పి ఆనందిస్తున్న సమంత.. మా అమ్మ నన్ను ఎప్పుడూ అంటూ ఉంటుంది. నేను చాలా తెలివైన దాన్నని.. కానీ నేనెప్పుడూ అలా అనుకునేదాన్ని కాదు.. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుండడంతో అమ్మ చెప్పిన మాటలు నిజమే అని నమ్ముతున్నా అంది.

దాంతో ఎన్టీఆర్.. నువ్వు జీనియస్‌వి అన్న విషయం మీ అమ్మగారికి తెలుసు.. దాన్ని నేను నిరూపించాను.. అందుకని కృతజ్ఞతగా నా కాళ్లకు దండం పెట్టడం, నా ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజలు చేయడం వంటివి చేయొద్దు సుమా అని ఎన్టీఆర్ అనడంతో షోలో నవ్వులు పూశాయి.

Next Story

RELATED STORIES