సినిమా

Samantha Ruth Prabhu: ఎక్కడికి వెళ్లినా వీళ్లు నన్ను వదలట్లేదు: సమంత

Samantha Ruth Prabhu: సమంత ప్రస్తుతం కాశ్మీర్ లో ఉంది. విజయదేవరకొండతో VD 11 చిత్రాన్ని చేస్తోంది..

Samantha Ruth Prabhu: ఎక్కడికి వెళ్లినా వీళ్లు నన్ను వదలట్లేదు: సమంత
X

Samantha Ruth Prabhu:ఫిట్‌నెస్ కి అధిక ప్రాధాన్యం ఇచ్చే సమంత తన కోసం స్పెషల్ కోచ్ ని నియమించుకుంది.. షూటింగ్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుంది.. జిమ్ ట్రెయినర్స్ కూడా ఆమెతో పాటు వెంట వచ్చి సమయానికి వ్యాయామాలు చేయిస్తుంటారు. అదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

సమంత ప్రస్తుతం కాశ్మీర్ లో ఉంది. విజయదేవరకొండతో VD 11 చిత్రాన్ని చేస్తోంది.. అక్కడికి కూడా తనతో పాటు వచ్చిన ట్రెయినర్స్ వర్కవుట్స్ చేయిస్తున్న విషయాన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఎక్కడికి వెళ్లినా వీళ్లు నన్ను వదలట్లేదు అని సరదాగా రాసుకొచ్చింది.

తన పక్కన ఉన్న తన ట్రైనర్‌తో కలిసి బరువులు ఎత్తుతున్న వీడియోను పంచుకుంటూ సమంత రూత్ ప్రభు మాట్లాడుతూ " అమన్ కరానీ, జునైద్ షేక్‌తో నా ఉదయం మొదలవుతుంది. నేను ఎక్కడికి వెళ్లినా...వీళ్ల నుండి తప్పించుకోలేను," అని ఫేస్‌పామ్ ఎమోజితో పోస్ట్ చేసింది.

మంచి, రుచికరమైన భోజనం అందిస్తున్నారు.. నేను వ్యాయామాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.. వర్కవుట్లు చేసుకునేందుకు కావలసిన స్క్వాట్ ర్యాక్స్ ని బాల్ రూమ్ లోకి అనుమతించినందుకు.. అన్ని విధాలుగా సహకరిస్తున్న హోటల్ వారికి ధన్యవాదాలు.. అని సమంత పోస్టులో తెలిపింది.

Next Story

RELATED STORIES