సినిమా

Samantha: నిజమైన స్నేహితులు.. కష్టసమయాల్లో అండగా నిలబడ్డారు..

Samantha: మనిషిని బాధ కృంగదీస్తున్నప్పుడు మనసైన వారితో పంచుకుంటే ఆ బాధ కొంత తగ్గుతుంది.

Samantha: నిజమైన స్నేహితులు.. కష్టసమయాల్లో అండగా నిలబడ్డారు..
X

Samantha: సంతోషంలో ఉన్నప్పుడు పలకరించకపోయినా బాధ అనిపించదు.. కానీ బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు తోడుగా ఉండాలని, అండగా నిలబడాలని అనుకోవడం సహజం. మనిషిని బాధ కృంగదీస్తున్నప్పుడు మనసైన వారితో పంచుకుంటే ఆ బాధ కొంత తగ్గుతుంది.

అదే విషయాన్ని ఇన్‌స్టాలో వివరించింది సమంత. ప్రముఖ వైద్యురాలు, పద్మశ్రీ మంజుల పుట్టిన రోజు వేడుకల్లో సమంత పాల్గొంది. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ మంజుల లాంటి మంచి వ్యక్తి పరిచయం తన అదృష్టమని తెలిపింది.

మీలాంటి స్నేహితులు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కష్ట సమయాలు నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తారు. మీ కంటే నిజమైన స్నేహితులు నాకెవరూ లేరు డాక్టర్. మీకు తెలుసు.. మిమ్మల్ని నేను ఎంతగా ఇష్టపడతానో.. ఎంతగా ప్రేమిస్తానో.. మీకు నా హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సమంత డాక్టర్ మంజులకు విషెస్ అందించింది ఇన్‌స్టా వేదికగా. ఇంకా ఈ ఫోటోలో దర్శకురాలు నందిని రెడ్డి, నటి మాళవిక నాయర్ ఉన్నారు.

Next Story

RELATED STORIES