Sathyaraj: 'బాహుబలి' నటుడు సత్యరాజ్ ఇంట విషాదం..

Sathyaraj (tv5news.in)

Sathyaraj (tv5news.in)

Sathyaraj: కట్టప్ప అనగానే తెలుగువారే కాదు దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ వెంటనే గుర్తుపట్టేస్తారు.

Sathyaraj: సత్యరాజ్.. ఈ పేరు చెప్తే ప్రేక్షకులు గుర్తుపడతారో లేదో తెలియదు కానీ.. కట్టప్ప అనగానే తెలుగువారే కాదు దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ వెంటనే గుర్తుపట్టేస్తారు. అలాంటి ఓ పాత్రకు నటనతో ప్రాణం పోశారు సత్యరాజ్. తాజాగా ఈ నటుడి ఇంట్లో ఓ విషాదం జరిగింది.

సత్యరాజ్ చెల్లెలు కల్పన మండ్రాదియార్ శనివారం సాయంత్రం కన్నుమూశారు. తమిళనాడులోని తిరుప్పుర్ జిల్లా కంగేయంలో నివసించే కల్పన ఆరోగ్యం వారం రోజుల నుండి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే ఆమెను కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

66 ఏళ్ల కల్పన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆవిడ శనివారం ప్రాణాలు విడిచారు. దీంతో సత్యరాజ్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సినీ ప్రముఖులు సత్యరాజ్ చెల్లెలు కల్పన మృతికి సంతాపం తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story