సినిమా

Sobhana: నటి శోభనకు ఒమిక్రాన్.. తీవ్ర అస్వస్థత

Sobhana: అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను

Sobhana: నటి శోభనకు ఒమిక్రాన్.. తీవ్ర అస్వస్థత
X

Sobhana: దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది.. కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలంతా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ శోభన ఒమిక్రాన్ బారిన పడ్డారు.

ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ తీవ్ర అనారోగ్య లక్షణాలతో ఇబ్బంది పడ్డాను. కీళ్ల నొప్పులు, చలి, గొంతు నొప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్నాను కాబట్టి భయపడట్లేదు.. అయినా నా జాగ్రత్తల్లో నేను ఉన్నాను..

డాక్టర్ సూచన మేరకు మందులు వాడుతున్నాను అని శోభన పేర్కొన్నారు. కాగా ఇండస్ట్రీలోని స్టార్స్ ఈ మధ్య కాలంలో కోవిడ్ బారిన పడడం ఎక్కువైంది, షూటింగ్ నిమిత్తం బయటకు వెళ్లడంతో వారిని కోవిడ్ అటాక్ చేస్తోంది. మహేశ్ బాబు, తమన్, మంచు లక్ష్మి, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, త్రిష సహా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES