సినిమా

Sivsankar Master: కోవిడ్‌తో పోరాడుతున్న సీనియర్ కొరియోగ్రాఫర్.. పరిస్థితి విషమం

Sivsankar Master: శివశంకర్‌ మాస్టారుకు 75 శాతం ఊపిరితిత్తులకు కరోనా సోకినట్లు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.

Sivsankar Master: కోవిడ్‌తో పోరాడుతున్న సీనియర్ కొరియోగ్రాఫర్.. పరిస్థితి విషమం
X

Sivsankar Master: జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మగధీరలోని 'ధీర ధీర' పాటకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును గెలుచుకున్న సీనియర్ కొరియోగ్రాఫర్ 4 రోజుల క్రితం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో చేరారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

శివశంకర్‌ మాస్టారుకు 75 శాతం ఊపిరితిత్తులకు కరోనా సోకినట్లు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. శివశంకర్ పెద్ద కుమారుడు కూడా వైరస్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. ఆయన భార్య కూడా ప్రాణాంతక వైరస్ బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్‌లో ఉంది. వారి చిన్న కొడుకు అజయ్ కృష్ణ ఈ కష్టకాలంలో కుటుంబం మొత్తాన్ని ఆదుకుంటున్నాడు.

శివశంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా దాదాపు 10 భాషలకు పైగానే సినిమా పాటలకు నృత్యాన్ని సమకూర్చారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 800 చిత్రాలకు పైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. పలు భాషల్లో ఉత్తమ అవార్డులు అందుకున్నారు.

Next Story

RELATED STORIES