థియేటర్లలో సందడి చేయనున్న శంకర్ దాదా..

థియేటర్లలో సందడి చేయనున్న శంకర్ దాదా..
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'శంకర్ దాదా MBBS' చిత్రం 2004లో విడుదలై సంచలనం సృష్టించింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'శంకర్ దాదా MBBS' చిత్రం 2004లో విడుదలై సంచలనం సృష్టించింది. చిరుకి జోడీగా సోనాలి బింద్రే నటించింది. ఇంకా ఇందులో శ్రీకాంత్, పరేష్ రావల్, గిరీష్ కర్నాడ్ వంటి హేమాహేమీలు కూడా ఉన్నారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రీ-రిలీజ్ నవంబర్ 4, 2023న షెడ్యూల్ చేయబడిందని నటుడు శ్రీకాంత్ సోషల్ మీడియాలో ప్రకటించారు.

'శంకర్ దాదా MBBS' కు మూలం 2003లో హిందీలో వచ్చిన హిట్ మూవీ 'మున్నా భాయ్ MBBS'కి అనుసరణ. తమిళంలో 'వసూల్ రాజా MBBS'గా రీమేక్ చేయబడింది. అన్ని భాషల్లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని మరోసారి థియేటర్లో చూసే అవకాశాన్ని తెలుగు ప్రేక్షకులు సొంతం చేసుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story