బిగ్‌‌బాస్ విజేత కన్నుమూత..

బిగ్‌‌బాస్ విజేత కన్నుమూత..
బిగ్ బాస్ ఫేమ్ సిద్ధార్థ్ శుక్లా ఈరోజు సెప్టెంబర్ 2 న 40 ఏళ్ళ వయసులో కన్నుమూసినట్లు కూపర్ హాస్పిటల్‌ అధికారి ధృవీకరించారు.

బిగ్ బాస్ ఫేమ్ సిద్ధార్థ్ శుక్లా ఈరోజు సెప్టెంబర్ 2 న 40 ఏళ్ళ వయసులో కన్నుమూసినట్లు కూపర్ హాస్పిటల్‌లో ఒక అధికారి ధృవీకరించారు. అతనికి 40 సంవత్సరాలు. నివేదికల ప్రకారం, శుక్లాకు ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ముంబైలోని కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శుక్లాకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

సిద్ధార్థ్ శుక్లా మరణవార్త విన్న వెంటనే, పలువురు ప్రముఖులతో పాటు అతని అభిమానులు ట్విట్టర్‌లో సంతాప సందేశాలను పెడుతున్నారు. 12 డిసెంబర్ 1980 న ముంబైలో జన్మించిన సిద్ధార్థ్ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (గతంలో అలహాబాద్) కు చెందిన వారు. శుక్లా సెయింట్ జేవియర్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. తరువాత రచన సంసాద్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్‌ నుండి కోర్సు చేసి పట్టభద్రుడయ్యాడు.

2008 లో సిద్దార్థ్ శుక్లా టెలివిజన్ పరిశ్రమలో ప్రవేశించాడు. బాబుల్ కా ఆంగన్ చూటే నా అనే షోతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఆహాత్, లవ్ యు జిందగీ, CID వంటి సీరియల్స్‌లో ప్రముఖ పాత్ర పోషించాడు. బాలికా వధూ అనే సీరియల్‌తో సిద్ధార్థ్ కెరీర్ మలుపు తిరిగింది. ఇందులో అతను ప్రధాన పాత్ర పోషించాడు.

అతను రియాల్టీ షో లక్ దిఖ్లా జా సీజన్ 6, ఇండియాస్ గాట్ టాలెంట్, ఖత్రోన్ కే ఖిలాది (KKK) 7, బిగ్ బాస్ 13, అలాగే బిగ్ బాస్ 14 వంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొని పాపులరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 13, KKK సీజన్ 7 విజేతగా బహుమతులు అందుకున్నాడు.

2014 లో, కరణ్ జోహార్ నిర్మించిన "హంప్టీ శర్మ కి దుల్హనియా" తో శుక్లా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అందులో అతడిది సహాయక పాత్ర అయినా మంచి పేరు తెచ్చిపెట్టింది. చివరిగా ఏక్తా కపూర్ 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3' లో సిద్ధార్థ్ శుక్లా అగస్త్య పాత్రలో నటించాడు.

Tags

Read MoreRead Less
Next Story