Shruti Hassan: సంక్రాంతి సోయగం శ్రుతి హాసన్.. హిట్టెవరిస్తారో..

Shruti Hassan: సంక్రాంతి సోయగం శ్రుతి హాసన్.. హిట్టెవరిస్తారో..
Shruti Hassan: శ్రుతి హాసన్ .. కమల్ కూతురుగా సినిమా పరిశ్రమలోకి వచ్చినా.. తనదైన సోయగాలతోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది.

Shruti Hassan: శ్రుతి హాసన్ .. కమల్ కూతురుగా సినిమా పరిశ్రమలోకి వచ్చినా.. తనదైన సోయగాలతోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. మొదట్లో బాలీవుడ్ లో ప్రయత్నించినా వర్కవుట్ అవలేదు. తర్వాత సౌత్ లో చేసిన సినిమాలన్నీ పోయాయి.




దీంతో అమ్మడిని ఐరన్ లెగ్ అన్నారు. ఆ ట్యాగ్ ను తీసేసి బ్లాక్ బస్టర్ హీరోయిన్ అనిపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. గబ్బర్ సింగ్ తో శ్రుతి ఫేట్ మారిపోయింది. అప్పటి నుంచీ దాదాపు అన్నీ విజయాలే. అందంతో పాటు నటననూ ప్రదర్శించగల శ్రుతి హాసన్ ఇప్పుడు ఇద్దరు సీనియర్ హీరోలతో చేసిన సినిమాలతో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. మరి శ్రుతికి విజయాన్ని ఇచ్చేది వీరయ్యా.. వీర సింహుడా..?



శ్రుతి హాసన్.. కొన్నాళ్లుగా తెలుగులో పెద్దగా సందడి చేయలేదు. బట్.. అప్పటికే అందరు స్టార్ హీరోలతోనూ నటించేసింది. మరోవైపు తమిళ్ లోకూడా మూవీస్ తగ్గించుకుంది. అయితే లాస్ట్ ఇయర్ చేసిన క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్లీ బిజీ అయిపోయింది. కాకపోతే ఈ సారి యంగ్ స్టర్స్ కాక సీనియర్స్ మాత్రమే ఛాన్స్ ఇచ్చారు.




తన తండ్రి వయసున్న ఇద్దరు టాప్ హీరోలతో ఈ యేడాది రెండు సినిమాలు చేస్తోందీ బ్యూటీ. చిరంజీవి సరసన వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాల్లో తనే హీరోయిన్. విశేషం ఏంటంటే.. ఈ విషయంలో తనకో రికార్డ్ కూడా రాబోతోంది. ఒక ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోలతో నటించిన రెండు సినిమాలు ఒకే సీజన్ లో విడుదలవుతుండటం. అది కూడా కేవలం ఒక్క రోజు గ్యాప్ లో. బాలయ్య వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి బరిలో జవనరి 12న విడదలవుతోంది.



ఇక చిరంజీవి వాల్తేర్ వీరయ్య జనవరి 13న వస్తోంది. ఇలాంటి రికార్డ్ ఈ మధ్య కాలంలో మరే హీరోయిన్ కూ లేదనే చెప్పాలి. మరో విశేషం ఏంటంటే.. వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇంతకు ముందు బలుపు, క్రాక్ అనే బ్లాక్ బస్టర్స్ లో నటించి ఉంది శ్రుతి హాసన్.



ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయితే అమ్మడికి ఈ దర్శకుడితో హ్యాట్రిక్ పడుతుంది. అటు ఆ సినిమా కూడా హిట్ అయితే మెగాస్టార్ తో మంచి బోణీ పడుతుంది. ఇక లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కరోనాను కూడా దాటుకుని క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకుందీ బ్యూటీ. మరి ఈ సారి సంక్రాంతికి శ్రుతి హాసన్ కు భారీ హిట్ ను ఇచ్చేది వీరయ్యా.. వీర సింహుడా అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story