సినిమా

Shyam Singha Roy Twitter Review: అద్భుతమైన ప్రేమకథ.. శ్యామ్‌సింగరాయ్ ట్విట్టర్ రివ్యూ..

Shyam Singha Roy Twitter Review: రాహుల్ సాంకృత్యన్ కథ ఆడియన్స్‌కి చేరింది. మొత్తానికి టిట్టర్ రివ్యూస్‌లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

Shyam Singha Roy Twitter Review: అద్భుతమైన ప్రేమకథ.. శ్యామ్‌సింగరాయ్ ట్విట్టర్ రివ్యూ..
X

Shyam Singha Roy Twitter Review: టాక్సీవాలాతోనే రాహుల్ సాంకృత్యాన్ ప్రతిభ ఏంటో అర్ధమైంది. అది శ్యామ్ సింగరాయ్‌తో మరోసారి రుజువైంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఎంచుకున్న కథ, తీసుకున్న నటీనటులు అన్నీ ప్లస్ పాయింట్సే. 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా తీసుకుని కథను నడిపించిన తీరు చిత్రానికి హైలెట్‌గా నిలిచింది.

ఇక నేచురల్ స్టార్ నానీ, సాయి పల్లవి నటించారు అనడం కంటే జీవించారు అని అనడం బావుంటుందేమో అని ట్విట్టర్ రివ్యూ‌స్‌లో ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నాని నటించిన వి, టక్ జగదీష్ ప్రేక్షకులను అనుకున్నంతగా సంతృప్తి పరచలేకపోవడంతో ఈ సినిమాపై నానీ చాలా ఆశలు పెట్టుకున్నారు.

100 శాతం తన ఎఫర్ట్స్ పెట్టి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో చేశారు. ఆయన కష్టానికి ఫలితం దక్కింది.. రాహుల్ సాంకృత్యన్ కథ ఆడియన్స్‌కి చేరింది. మొత్తానికి టిట్టర్ రివ్యూస్‌లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

దేవదాసీ పాత్రలో సాయిపల్లవి నటన, నాట్యం అన్నీ సూపర్బ్‌గా ఉన్నాయని అంటున్నారు. నాని, సాయిపల్లవి ప్రేమ కథను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దారని అంటున్నారు. ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ రోల్స్ పోషించి రెండింటికీ సమన్యాయం చేసి ఫుల్ మార్క్ కొట్టేశాడు.

ఇక రాహుల్ సాంకృత్యన్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ ఫ్రేమ్‌ను ఆహా అనిపించేలా చూపించారు. కథను నడిపించిన తీరు ఆద్యంతం ఆకట్టుకుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్.

Next Story

RELATED STORIES