Sidharth Shukla: సిద్ధార్థ్ శుక్లా నటించిన చివరి రొమాంటిక్ వెబ్ సిరీస్ కి అవార్డ్..

Sidharth Shukla: సిద్ధార్థ్ శుక్లా నటించిన చివరి రొమాంటిక్ వెబ్ సిరీస్ కి అవార్డ్..
Sidharth Shukla: ఏక్తా కపూర్ తీసిన వెబ్ సిరీస్ మూడవ సీజన్ లో సిద్ధార్థ అగస్త్యరావు పాత్రను పోషించాడు.

Siddharth Shukla: ప్రముఖ టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా ఈ లోకాన్ని వీడి అప్పుడే ఆరు నెలలు కావస్తోంది. అయినా ఆయన అభిమానులు అతడిని మర్చిపోలేకపోతున్నారు. సిద్ధార్థ నటించిన చివరి వెబ్ సిరీస్ కి అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. 2021లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌గా సిద్ధార్థ్ శుక్లా యొక్క 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' ను అవార్డు వరించింది. సిద్ధార్థ్ శుక్లా గతేడాది సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించారు.

ఏక్తా కపూర్ తీసిన వెబ్ సిరీస్ మూడవ సీజన్ లో సిద్ధార్థ అగస్త్యరావు పాత్రను పోషించాడు. ఆయనతో పాటు సోనియా రాఠీ ప్రధాన పాత్రలో నటించింది. ఇది ఓ రొమాంటిక్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. వెబ్ సిరీస్‌లోని పాటలు, సిద్ధార్థ్-సోనియాల కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. కానీ ఈ వెబ్ సిరీస్ విడుదలైన కొన్ని నెలలకే సిద్ధార్థ్ శుక్లా తన ప్రియమైన వారిని, అభిమానులను శాశ్వతంగా విడిచి వెళ్లిపోయాడు.

సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలా వ్రాశాడు- "సిద్ధార్థ్ శుక్లా నటించిన వెబ్ సిరీస్ 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' సీజన్ 3 అవార్డును గెలుచుకుంది.. ఇది ఆయన అభిమానులకు సంతోషాన్నిచ్చే విషయం అని రాశారు.

Tags

Read MoreRead Less
Next Story