సినిమా

Siri-Srihan : దీప్తి , షణ్ముఖ్‌ సరే.. సిరి- శ్రీహాన్ సంగతి ఏంటి?

Siri-Srihan : ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్ కి ఊహించని షాకిచ్చింది దీప్తి సునయన.. షణ్ముఖ్‌తో బ్రేకప్ అంటూ ఎమోషనల్ పోస్ట్‌ పెట్టింది.

Siri-Srihan : దీప్తి , షణ్ముఖ్‌ సరే.. సిరి- శ్రీహాన్ సంగతి ఏంటి?
X

Siri-Srihan : ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్ కి ఊహించని షాకిచ్చింది దీప్తి సునయన.. షణ్ముఖ్‌తో బ్రేకప్ అంటూ ఎమోషనల్ పోస్ట్‌ పెట్టింది. చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టుగా వెల్లడించింది దీప్తి. ఆమె ఎమోషనల్ పోస్ట్ పైన షణ్ముఖ్ కూడా స్పందించాడు.

దీప్తికి మంచి జరగాలని కోరుకుంటున్నానని, భవిష్యత్తులో ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ లో జరిగిన పరిణామాల వల్లే దీప్తి ఈ నిర్ణయం తీసుకుందని సిరి వల్లే వీరిద్దరూ విడిపోయారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ క్రమంలో సిరి స్పందిస్తూ వారిద్దరూ విడిపోవడానికి కారణం తాను కాదని చెప్పుకొచ్చింది. ఇదిలావుండగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది.

సిరి- శ్రీహాన్ కూడా విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ కి బ్రేకప్ చెప్పే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో వస్తోన్న ఈ వార్తల పైన సిరి- శ్రీహాన్ స్పందిచాల్సి ఉంది.

Next Story

RELATED STORIES